వినాయక విగ్రహానికి అపచారం

ABN , First Publish Date - 2021-09-14T06:31:10+05:30 IST

ప్రత్తిపాడు, సెప్టెంబరు 13: మండలంలోని వాకపల్లిలో వినాయక విగ్రహానికి అపచారం జరిగింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని పాఠశాల సమీపంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి చవితి రోజున గ్రామస్తులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మూడు రోజులుగా పూజలు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఒక వ్యక్తి మండపంలోకి చొరబడి వినాయక విగ్రహాన్ని మండపం నుంచి కిందకు తోసేశాడు. సో

వినాయక విగ్రహానికి అపచారం
మండపంపై చెల్లాచెదురైన సామగ్రి, కింద పడిపోయిన వినాయక విగ్రహం

వాకపల్లిలో ఘటన 

గ్రామస్తుల ఆందోళన 

సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు

ప్రత్తిపాడు, సెప్టెంబరు 13: మండలంలోని వాకపల్లిలో వినాయక విగ్రహానికి అపచారం జరిగింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని పాఠశాల సమీపంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి చవితి రోజున గ్రామస్తులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మూడు రోజులుగా పూజలు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఒక వ్యక్తి మండపంలోకి చొరబడి వినాయక విగ్రహాన్ని మండపం నుంచి కిందకు తోసేశాడు. సోమవారం ఉదయం విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు వినాయక మండపం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మూడు రోజులుగా పూజలందుకున్న వినాయక విగ్రహానికి జరిగిన అపచారం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇన్‌చార్జ్‌ సీఐ కిషోర్‌బాబు, ఎస్‌ఐ సుధాకర్‌ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ప్రజలు వినాయక విగ్రహాన్ని స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా సోమవారం రాత్రి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Updated Date - 2021-09-14T06:31:10+05:30 IST