సివిల్‌ సర్వీసెస్‌కు ప్రవీణ్‌ గౌతమ్‌

ABN , First Publish Date - 2020-08-05T11:46:10+05:30 IST

అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌కు ఏలూరుకు చెందిన కంభం శామ్యూల్‌ ప్రవీణ్‌ గౌతమ్‌ ఎంపిక య్యారు.

సివిల్‌ సర్వీసెస్‌కు ప్రవీణ్‌ గౌతమ్‌

ఆలిండియా 584వ ర్యాంకు



ఏలూరు ఎడ్యుకేషన్‌ / భీమవరం క్రైం, ఆగస్టు 4 : అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌కు ఏలూరుకు చెందిన కంభం శామ్యూల్‌ ప్రవీణ్‌ గౌతమ్‌ ఎంపిక య్యారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రాతపరీక్షలు జరగగా, ఈఏడాది ఫిబ్రవరి - ఆగస్టు నెలల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించిన పర్సనాల్టీ టెస్ట్‌లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను యుపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసింది.


శామ్యూల్‌ ప్రవీణ్‌ గౌతం ఆలిండియా 584వ ర్యాంకు లభించింది. ఈ ర్యాంకుకు ఐపీఎస్‌ లేదా ఐఏఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. రవాణా శాఖ భీమవరం ఇన్‌ఛార్జి ఆర్టీవోగా పని చేస్తున్న కె.విజయరాజు కుమారుడు శామ్యూల్‌ ప్రవీణ్‌ గౌతం ఇంటర్మీడియట్‌ వరకూ ఏలూరు, బీటెక్‌ను తిరుచ్ఛి ఎన్‌ఐటీలో పూర్తి చేశాడు. తండ్రి విజయ రాజు ఆర్టీవో, తల్లి ఏలూరు రూరల్‌ మండలం గుడివాకలంక జడ్పీ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. గౌతమ్‌ ర్యాంక్‌ సాధించడంపై తల్లిదండ్రులు, అతడి సోదరులు, సోదరీమణులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-05T11:46:10+05:30 IST