చెరువుల్లో అధిక శాతం చల్లదనం ఏర్పడి.. ఆక్సిజన్‌ అందక..

ABN , First Publish Date - 2021-07-12T18:57:20+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో..

చెరువుల్లో అధిక శాతం చల్లదనం ఏర్పడి.. ఆక్సిజన్‌ అందక..

కలిదిండి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లో అధిక శాతం చల్లదనం ఏర్పడి ఆక్సిజన్‌ అందక వనామి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. మండలంలో 15 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తు న్నారు. పెదలంక, మూల్లంక, పెదపుట్లపూడి, భాస్కరావు పేట, మట్టగుంట, కొండంగి, గొల్లగూడెం, కాళ్లపాలెం, సంతోషపురం, సున్నంపూడి, దుంపల కోడుదిబ్బ, చినతా డినాడ గ్రామాల్లో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరతతో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో కౌంటుకు రాకుండానే చిన్నసైజు రొయ్యలు హడావిడిగా పట్టుబడి చేస్తున్నారు.  చిన్నసైజం  కారణంగా గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు వాపో తున్నారు. వనామి రొయ్యల సాగుకు వాతావరణం అను కూలంగా ఉండటంతో వేలాది ఎకరాల్లో సాగు చేపట్టారు. ఎకరానికి రెండు లక్షలు వరకు పెట్టుబడి పెట్టారు. అధిక వ్యయంతో ఏరియేటర్లు, విద్యుత్‌ మోటార్‌ పంపులు అమర్చారు. అయితే, కనీస ఖర్చులు కూడ రాకపోవటంతో అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. చనిపోయిన రొయ్యలు ఎరుపు రంగుగా మార టంతో వీటిని వ్యాపారస్థులు కొనుగోలు చేయటం లేదు. దీంతో రంగుమారిన రొయ్యలను గోతుల్లో వేసి పూడ్చు తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏరియేటర్లను చెరువుల్లో తిప్పుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు అంటున్నారు. అకస్మాత్తుగా రొయ్యలు చనిపోతుండటంతో వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు రొయ్యలను కొంటున్నారని వాపో తున్నారు. విదేశీ మాదక ద్రవ్యం లభించే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.


ఆక్సిజన్‌ కొరత నివారణకు చర్యలు 

ఆక్సిజన్‌ కొరత నివారణకు చెరువుల్లో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తగు మోతాదిలో పిచికారి చేయాలని మత్స్యశాఖాభివృద్ధి అధికారి గణపతి తెలిపారు. వాతావరణం చల్లగా ఉన్న ప్పుడు ఏరియేటర్లు నిరంతరం తిరుగుతూ ఉండాలని, బోట్లు, ఆయిల్‌ ఇంజన్లు ఏర్పాటు చేసి చెరువులో నీటిని రీసైక్లింగ్‌ చేయటంతో కెరటాలు రావటంతో ఆక్సిజన్‌ ఉత్ప న్నమవుతుందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉన్న ప్పుడు మేత తక్కువగా వేయాలన్నారు. తెల్లవారుజామున చెరు వుల్లో బోట్లు తిప్పాలన్నారు. 24 గంటలూ ఏరియేటర్లు తిరగటానికి జనరేటర్లు కూడ ఏర్పాటు చేసుకోవాలన్నారు. గాలివానకు కరెంట్‌ పోతే ప్రత్యా మ్నాయంగా ఏరియేటర్లకు జనరేటర్లు అమర్చుకుని అవి తిరిగే విధంగా చూసుకోవాలన్నారు. 


Updated Date - 2021-07-12T18:57:20+05:30 IST