Sep 19 2021 @ 15:02PM

నవంబర్ లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ తదుపరి షెడ్యూల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కు రెడీ అవుతుండగా..  ‘సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ చిత్రాలు మూడూ సెట్స్ మీదున్నాయి. వీటిలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఫాంటసీ సైంటిఫిక్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ గురుపౌర్ణమి నాడు ప్రభాస్ , అమితాబ్ బచ్చన్ ఈ సినిమా ప్రారంభమైనట్టు  ఇన్ స్టా గ్రామ్ వేదిక గా వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణే సైతం ఈ ప్రాజెక్ట్ గురించి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. 

ఇక ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ నవంబర్ లో మొదలు కాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో  దాదాపు అందరు నటీనటులు ఈ షెడ్యూల్ లో జరిగే సీన్స్ లో నటిస్తారు. ఈ సినిమా మొత్తం పూర్తి కావడానికి ఇంకా 12 నుంచి 13 నెలల సమయం పడుతుందని మేకర్స్ చెబుతున్నారు.  తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ  వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమాకి ‘ ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ అయింది. త్వరలోనే మేకర్స్ సినిమాకి టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు.