నేడు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-25T05:36:45+05:30 IST

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు ఉద్యోగులు సమాయత్తమయ్యారు.

నేడు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల ధర్నా
నినాదాలు చేస్తున్న పీఆర్సీ సాధన సమితి జిల్లా నాయకులు

ఉద్యోగులను సమాయత్తం చేసిన పీఆర్సీ సాధన సమితి నాయకులు
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సన్నాహక సమావేశాలు


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 24 :
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు ఉద్యోగులు సమాయత్తమయ్యారు. ధర్నా విజయవంతం చేయడం ద్వారా మెరుగైన పీఆర్సీ ఫిట్‌మెంట్‌, పాత స్లాబ్‌లతో హెచ్‌ ఆర్‌ఏ, అదనపు పెన్షన్‌ కొనసాగింపు తదితర అంశాలపై తమ ఆందోళన ప్రభుత్వానికి తెలియచేయడానికి ఉద్యో గుల ఐక్యవేదిక సిద్ధమైంది. ప్రజలను తప్పుదోవ పట్టిం చేలా ఉద్యోగుల పట్ల పరోక్షంగా ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టేందుకు ధర్నాను ఒక వేదికగా వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో పాటే ఉద్యోగ సంఘాల ఐక్యతను ప్రభుత్వానికి  తెలియ జేయనున్నారు. ఇందులో భాగంగానే పీఆర్సీ సాధన సమితి భాగస్వామ్య సంఘాల జిల్లా నాయకులందరూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి మంగళ వారం కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.


పీఆర్సీపై ఇచ్చిన జీవోలను మార్పు చేయాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ నాయకులు ఆర్‌.ఎస్‌.హరనాధ్‌, సి.హెచ్‌.శ్రీనివాస్‌, కె.రమేష్‌కుమార్‌, డి.కృష్ణంరాజు తదితర నాయకుల నేతృత్వంలోని బృందం ఏలూరులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మంగళవారం కలెక్టరేట్‌ వరకు నిర్వహించనున్న ర్యాలీ, ధర్నాకు సమాయత్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టకు వెళ్ళకుండా ఉద్యోగు లకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో తదుపరి కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి 3న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు.


ఉద్యోగులను చైతన్యపరిచే క్రమంలో ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు నల్లా అప్పారావు, నాగేశ్వర రావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, గోవిందరావు, నాగమణి, సుశీల తదితరులు డీఎంహెచ్‌వో కార్యాల యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ధర్నాకు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.


ఉద్యోగ, ఉపాధ్యాయ రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగుల పాలిట గొడ్డలిపెట్టు వంటిదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సాల్మన్‌రాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి దొర, నారాయణలు విమర్శించారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఐఆర్‌ 27 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ మంగళ వారం కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన మహార్యాలీ, ధర్నాలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని కోరారు.

Updated Date - 2022-01-25T05:36:45+05:30 IST