పీఆర్సీ ప్రతులను దహనం చేసిన ఏపీ జేఏసీ

ABN , First Publish Date - 2022-01-21T05:10:55+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన నూతన వేతన సవరణ తమకు వద్దు అని, పాత జీతాలే కావాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి నినదించాయి.

పీఆర్సీ ప్రతులను దహనం చేసిన ఏపీ జేఏసీ
ప్రతులను దహనం చేస్తున్న దృశ్యం

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20: ప్రభుత్వం ప్రకటించిన నూతన వేతన సవరణ తమకు వద్దు అని, పాత జీతాలే కావాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి నినదించాయి.  రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం పీఆర్సీ ప్రతులను దహనం చేశాయి. తొలుత ఏపీఎన్‌జీవో సంఘం భవనం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరి అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి డి.వేణుమాధవరావు మాట్లాడుతూ ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె భత్యం, సీసీఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు మీసాల మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తక్షణమే పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నగర ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ జీవోలను రద్దుచేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో ఎన్జీవో సంఘం నగర కార్యదర్శి ప్రవీణ్‌, సీపీఎస్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ, నగర అధ్యక్షురాలు నాగమణి, ఎన్జీవో మహిళ సంఘం నాయకులు మంగతాయారు, రాజకుమారి, సుందరి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:10:55+05:30 IST