Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 17 2021 @ 17:47PM

రెండు మూడు రోజుల్లో పీఆర్సీ

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు  రాబోయే రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ శుభవార్త చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటన చేయడంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటకు నిలబడతామన్నారు. 


కొన్ని రోజులుగా రాష్ట్రంలో  పీఆర్సీ పై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనతో 29% పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే అన్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement