పీఆర్సీపై భగ్గు..!

ABN , First Publish Date - 2022-01-19T06:32:33+05:30 IST

పీఆర్సీ అమలులో ప్రభుత్వం దగా చేయడంపై వేతనజీవులు భగ్గుమన్నా రు. 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడంపై అన్నివర్గాల ఉద్యోగుల్లోనూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

పీఆర్సీపై భగ్గు..!

ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లలో ఆగ్రహావేశాలు

23.29 శాతం ఫిట్‌మెంట్‌తోనే 

ఆయావర్గాల్లో మంట

జిల్లా సరిహద్దు అగళిలో ఉన్నా... 

అనంతలో ఉన్నా ఒక్కటే హెచ్‌ఆర్‌ఏ..

హెచ్‌ఆర్‌ఏ 8 శాతంతో తీవ్ర ఆందోళన

2021 డిసెంబరుకు ముందు 

రిటైరైన వేలాదిమందికి భారీ నష్టం

గ్రాట్యుటీ మొత్తంలో ఒక్కొక్కరు 

రూ.4 లక్షలు కోల్పోతున్న వైనం 

జిల్లావ్యాప్తంగా 1.25 లక్షల మంది 

ఉద్యోగులు, పెన్షనర్లు

వారందరిలోనూ ఆక్రోశం

సమరశంఖం పూరించిన ఉద్యోగులు

తొలిరోజు భారీగా 

నల్లబ్యాడ్జీలతో నిరసనలు 

అనంతపురం విద్య, జనవరి 18: పీఆర్సీ అమలులో ప్రభుత్వం దగా చేయడంపై వేతనజీవులు భగ్గుమన్నా రు. 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడంపై అన్నివర్గాల ఉద్యోగుల్లోనూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. గ్రాట్యుటీ అమౌంట్‌ను పెంచినట్టే పెంచి... ఏడాదికి ఏకంగా రూ.4 లక్షలు నష్టం చేకూరేలా చేయడంపై మండిపడుతున్నా రు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1.25 లక్షల మంది ఉద్యోగు లూ.. సర్కారు ప్రకటించిన రివర్స్‌ పీఆర్సీపై భగ్గుమంటున్నారు. ఏ నలుగురు కలిసినా.. నానా శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇచ్చిన ‘పీఆర్సీ పీచేముడ్‌’ అంటూ వెనక్కు మళ్లుతోందంటున్నారు. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలియజేశారు. తర్వాత సహాయ నిరాకరణ కు, సర్కారుపై సమరాస్త్రం సంధించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించారు.


పెన్షన్లపై ఎత్తిన బండ...!

జిల్లాలో అటెండర్‌ స్థానం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ (నాన్‌ ఐఏఎస్‌) కేడర్లలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లు 30 వేల మందిదాకా ఉన్నారు. వీరందరికి టీడీపీ హయాంలో అ మలైన ఈహెచ్‌ఎస్‌, రీయింబర్స్‌మెంట్‌ను ప్రస్తుత వైసీ పీ ప్రభుత్వం ఎత్తేసింది. అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్ష న్‌ (అదనపు పెన్షన)ను రద్దు చేసింది. గత ప్రభుత్వంలో ఈ అదనపు పెన్షనను 70 ఏళ్ల పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్ల పెన్షనర్లకు 15 శాతం, 80 ఏళ్ల వయసున్న వా రికి 20 శాతం, 85 ఏళ్ల పెన్షనర్లకు 25 శాతం, 90 సంవత్సరాల పెన్షనర్లకు 30 శాతం, 95 సంవత్సరాల పెన్షనర్లకు 35 శాతం, వంద సంవత్సరాలున్న పెన్షనర్లకు 50 శాతం చొప్పున వారివారి నెలవారీ పెన్షన్లకు అదనంగా ఈ శా తాలను కలిపి వచ్చేది. ప్రస్తుతం ఆ అదనపు పెన్షన్‌ను 80 సంవత్సరాల నుంచే ఇస్తామని చెప్పడంతో పె న్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 80 ఏళ్లు అంటే అది ఎవరికి అమలవుతుందో... ఆ వయసు వరకూ బతకగలమా అని పలువురు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


హెచ్‌ఆర్‌ఏకు గండికొట్టి...

ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏకు గండి కొట్టేశారు. పట్టణ ఉద్యోగిని, పల్లెటూరుల్లో పనిచేసేవారికి ఒకేలా అమలు చేశా రు. 8 శాతం ఇవ్వడంతో తీవ్రంగా నష్టపోనున్నా రు. జి ల్లాకేంద్రమైన అనంతపురంలో ఉన్న ఉద్యోగికైనా... అగళి, అమరాపురం వంటి జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారికైనా ఒకే హెచ్‌ఆర్‌ఏ అమలు కానుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఉండే ఓ ఉద్యోగికి పెరిగిన పీఆర్సీ వల్ల బేసిక్‌ రూ.70 వేలు అయినా... 8 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తే... రూ.5,600 హెచ్‌ఆర్‌ఏ మాత్రమే వ స్తుంది. అదే రూ.35 వేలు బేసిక్‌ పే వచ్చే ఉద్యోగికి హె చ్‌ఆర్‌ఏ రూ.2800 వస్తుంది. ఈ హెచ్‌ఆర్‌ఏతో కనీసం సింగిల్‌ బెడ్‌ రూం ఎక్కడైనా సాధ్యమేనా..? ఎవరి కోసం ఇది ప్రకటించినట్లు అంటూ సగటు ఉద్యోగి తీవ్ర ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్‌ఆర్‌ఏకు ప్రభు త్వం గండికొట్టడంతో గతంలో 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధిలో ఉండే ఉద్యోగులకు 6.5 శాతం, 12 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధిలో ఉండే ఉద్యోగులకు 4 శాతం నష్టపోతున్నారు. డీఏ, సీపీఏల విషయంలో కూడా ప్రభు త్వం మోసపూరితంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


గ్రాట్యుటీ అమౌంట్‌ పెంచి... తుంచి....

ఉద్యోగ విమరణ పొందిన ఉద్యోగులకు అందించే గ్రా ట్యుటీ అమౌంట్‌ను పెంచి... వేలాది మందికి తుంచేశారు.ఆ మొత్తాన్ని రూ.12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. ఆమొత్తాన్ని జనవరి2022 నుంచి అమలు చే స్తామనడంతో... వేలాదిమంది నష్టపోతారు. 2021 డి సె ంబరు ఆఖరులో ఉద్యోగ విరమణ పొందిన వారంతా ఆ మొత్తం రూ.4లక్షలు నష్టపోయినట్లే అవుతుంది. దీంతో పెంచినా తుంచినట్టేఅవుతోందంటూ మండిపడుతున్నారు.


ఉద్యోగులను ఉసూరుమనిపించి...

ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఊరించి ఒక్కసారిగా దొంగదెబ్బ కొట్టి ఉసూరుమనిపించింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రం గ యాజమాన్యాల్లో 23 వేల మంది వరకు టీచర్లున్నారు. మరో 40 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు, రమారమి 32 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితోపాటు 30 వేల మంది పెన్షనర్లున్నారు. ఆయావర్గాల ఉద్యోగులు రెండున్నరేళ్లుగా పీఆర్సీ వస్తే... అన్ని రకాలుగా జీతాలు పెరుగుతాయంటూ ఆశగా ఎదురుచూశారు. ఆ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆఖరుకు ఫిట్‌మెంట్‌ ఐఆర్‌ 27 శాతం కంటే తక్కువగా 23.29 శాతమే ప్రకటించినా... హెచ్‌ఆర్‌ఏ అలాగే కొనసాగిస్తారంటూ... పక్షం రోజులుగా ఓపికగా వేచి చూశారు. ఉన్నఫలంగా హెచ్‌ఆర్‌ఏను సైతం ఏకంగా 8 శా తానికి కుదించడంపై మండిపడుతున్నారు.


ఉద్యోగులంతా ఏకతాటిపై ఉద్యమిస్తాం

పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గా ఉన్నా... రాష్ట్ర నేతలు వదిలేసినా ఉద్యోగులు వదిలే స్థితిలో లేరు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులంతా ఏకమై ఉద్యమా న్ని తీవ్రతరం చేస్తాం. హెచ్‌ఆర్‌ఏ త గ్గించడంలో శాస్ర్తీయతే లేదు. గ తం లో ప్రకటించిన 10వ పీఆర్సీల సమయంలో కూడా హెచ్‌ఆర్‌ఏలో ఎలాంటి కో తలు విధించలేదు. ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏలో కో త విధిస్తే ఒక్కో ఉద్యోగి రూ.లక్షల్లో నష్టపోతారు. ఎవరి సొమ్మని కోతలు విధిస్తారు. అధికారంలోకి వస్తే... 27 శాతం ఐఆర్‌ ఇస్తామని సీఎం జగన్మోహన్‌రెడ్డి మాయమాటలు చెప్పి ఉద్యోగులను నయవంచనకు గురిచేశారు. జేఏసీ నాయకులు నోరు మెదపకపోయినా... సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా.. ఉద్యోగులం తా ఏకతాటిపైకి వచ్చి, పోరాటాన్ని ఉధృతం చేస్తాం.

మనోహర్‌రెడ్డి, నగరాధ్యక్షుడు, ఏపీఎన్జీఓల సంఘం 


భవిష్యత్తు అంధకారంలోకి..

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడింది. ఫిట్‌మెంట్‌ ఐఆర్‌ కంటే తక్కువ ఇవ్వడం దారుణం. మునుపెన్నడూ ఇలాంటి పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఉద్యోగులు చూడలేదు. హెచఆర్‌ఏ స్లాబును యథావిధిగా కొనసాగించలేకపోవడం మరింత అధ్వానం. జులై 2019 నుంచి మార్చి 2020 వరకు తీసుకున్న ఐఆర్‌  మొత్తానికి డీఏ బకాయిలను సర్దుబాటు చేయడం సబబుకాదు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంఘటితమై ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

నాగేంద్ర, జిల్లా ప్రధానకార్యదర్శి, యూటీఎఫ్‌


27 శాతం ఐఆర్‌ ఇవ్వాల్సిందే..

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షనర్లను ఇబ్బందులు పెడుతూనే ఉంది. తాము వైద్యం పొందే ఈహెచ్‌ఎ్‌సపై వేటు వేసి వైద్యానికి దూరం చేసింది. ఏదైనా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లు చేయించుకుంటే ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేసింది. తాజాగా ప్రభు త్వం ఎవరికీ ఆమోదయోగ్యంకాని పీఆర్సీని ప్రకటించి, పెన్షనర్లను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. పెన్షనర్లకు అందించే అదనపు పెన్షన్‌ను 80 సంవత్సరాలకు కుదించడం బాధాకరం. ప్రస్తుత పరిస్థితుల్లో 80 ఏళ్లు ఎవరైనా బతుకున్నారా...? ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణం. ప్రస్తుతం ఇచ్చిన పీఆర్సీ వల్ల పెన్షనర్లకు ఒరిగేదేమీ లేదు. పీఆర్సీ మాకు వద్దు... ముందు మాదిరే 27 శాతం ఐఆర్‌తోపాటు అన్ని డీఏలను ఇవ్వాల్సిందే. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్‌రెడ్డికి సరైన గుణపాఠం చెబుతాం.

పెద్దనగౌడ్‌, జిల్లా అధ్యక్షుడు, పెన్షనర్ల సంఘం 


పీఆర్సీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం

ప్రభుత్వం ప్రకటించింది రివర్స్‌ పీఆర్సీ. ఉద్యోగుల సంక్షేమం పట్టని పీఆర్సీ. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను పక్కనబెట్టి ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతుంటే... ఉన్నఫలంగా ఇంటి అద్దె అలవెన్సును 8 శాతానికి తగ్గించడం శోచనీయం. ఏకంగా 4 శాతం, 6.5 శాతం చాలా మంది ఉద్యోగులకు తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. లేనిపక్షంలో పీఆర్సీ నిరసన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

హరికృష్ణ, ఫోర్టో, రాష్ట్ర అధ్యక్షుడు 

Updated Date - 2022-01-19T06:32:33+05:30 IST