పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T04:57:44+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆర్‌జేయూపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుడిశెట్టి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్‌ సంఘం ముఖ్య నాయకులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు.

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్యాలయ సిబ్బంది, అధికారులు

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆర్‌జేయూపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుడిశెట్టి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్‌ సంఘం ముఖ్య నాయకులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ పీఆర్సీ అఽధ్యాయనంపై ఏర్పాటు చేసిన అశుతో్‌షమిశ్రా నివేదికను బయటపెట్టకుండా, ఇంత కాలం కాలయాపన చేసి చివరకు 23 శాతం రివర్స్‌ ఫిట్మెంట్‌ను కార్యదర్శుల కమిటీ పేరుతో ప్రకటించడం సరికాదని, వెంటనే ఆ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, ఓబులరెడ్డి మాట్లాడుతూ సీపీయస్‌ రద్దు, పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులంతా సంఘాలకు అతీతంగా ఐకమత్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. 


డీఈవో కార్యాలయ సిబ్బంది నిరసన 

పీఆర్సీకి వ్యతిరేకంగా బుధవారం డీఈవో కార్యాలయ సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఈవో కార్యాలయ ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  


ఐట మద్దతు

పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడికి ఆల్‌ ఇండియా ఐడియల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఐట) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.అబ్దుల్‌ రజాక్‌, జిల్లా అధ్యక్షుడు ఎస్‌.నజీర్‌బాషా తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-01-20T04:57:44+05:30 IST