Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో బాయిస్‌ అండ్‌ మెషిన్స్‌

ప్రీఓన్డ్‌ లగ్జరీ కార్ల షోరూమ్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బాయిస్‌ అండ్‌ మెషిన్స్‌ కంపెనీ హైదరాబాద్‌లో  ప్రీఓన్డ్‌ లగ్జరీ కార్లను షోరూమ్‌ను ప్రారంభించింది. దక్షిణాదిలోనే ఇది మొదటిది. దేశంలో నాలుగోది. బంజారా హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ లగ్జరీ కార్లను విక్రయించడంపై దృష్టి పెట్టనున్నట్లు సీఈఓ అకాశ్‌ చతుర్వేది తెలిపారు. వాడిన లగ్జరీ కార్ల క్రయవిక్రయాలతో బీమా కవరేజీ, రుణ సదుపాయం వంటి సేవలను కూడా ఈ షోరూమ్‌లో అందిస్తారు. అధిక ఖరీదైన స్పోర్ట్స్‌, ప్రీఓన్డ్‌ లగ్జరీ కార్లకు హైదరాబాద్‌లో మంచి గిరాకీ ఉందని.. అందుకనే దక్షిణాదిలో మొదటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 2021 చివరి నాటికి మరిన్ని షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు  చెప్పారు. 

Advertisement
Advertisement