ప్రీప్రైమరీ స్కూల్స్‌గా అంగన్‌వాడీ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-01-20T05:50:33+05:30 IST

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీ ప్రైమరి స్కూల్స్‌గా ఏర్పాటు చేసి 3నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పాఠశాల పూర్వ విద్యను అందించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

ప్రీప్రైమరీ స్కూల్స్‌గా అంగన్‌వాడీ కేంద్రాలు

 5 సంవత్సరాల లోపు బాలబాలికలకు విద్యా 

రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్‌

 ఎర్రగొండపాలెం, జనవరి 19 : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీ ప్రైమరి స్కూల్స్‌గా ఏర్పాటు చేసి 3నుంచి  5 సంవత్సరాలలోపు పిల్లలకు పాఠశాల పూర్వ విద్యను అందించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఎర్రగొండపాలెంలో వైఎస్సార్‌ ప్రీ ప్రైమరిస్కూల్స్‌లో బోధించే విద్యపై అంగన్‌వాడీ కార్యకర్తలకు జరుగుతున్న  శిక్షణ ముగింపు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీకేంద్రాలలో కేవలం పౌష్టికాహారం పంపిణీ చేసే  కాకుండ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు విద్య నేర్పించడం ప్రధాన ధ్వేయం అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రీప్రైమరి స్కూల్సుగ నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరక్టరు జి లక్ష్మీదేవి, ఇన్‌చార్జి సీడీపీఓ ఎం పద్మావతి, డిల్‌డివో సాయికుమార్‌, ఇన్‌చార్జి తహసీల్దారు వి వీరయ్య, మాజీ ఎంపీపీ విజయభాష్కర్‌, మండల కన్వీనర్లు డి.కిరణ్‌గౌడ్‌, ఉడుముల శ్రీనివాసరెడ్డి, అంగన్‌వాడీ సూపరువైజర్లు ఎ పద్మావతి, హేమలత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:50:33+05:30 IST