Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందాల పోటీల్లో హైదరాబాద్ కుర్రాడికి అవార్డ్

ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని హైదరాబాద్‌కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు. జెస్సీ విక్టర్ , ర‌జ్నామొహ‌మ్మద్‌ల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దుబాయ్ మరియు భారతదేశం ఆధారిత కంపెనీ అయిన రేజ్‌ఎన్‌యు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో గోవాలో నిర్వ‌హించిన అతిపెద్ద మరియు ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో మిస్ట‌ర్ సూప‌ర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 ఒక‌టి. హైదరాబాదీ ప్రీతమ్ కళ్యాణ్ ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్‌చే ఈ అవార్డును ఆయన అందుకున్నారు.ఈ సంద‌ర్భంగా ప్రీతమ్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డును ద‌క్కించుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ పోటీలో 20కి పైగా నగరాల నుండి 120 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నారు. ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు మార్పును తీసుకురావడానికి అందాల వేదిక ఒక గొప్ప వేదిక. అందంగా ఉండటంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా కొత్త ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదిక‌లు ఉప‌యోగ‌ప‌డతాయి. మిస్ట‌ర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 అనేది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, పరివర్తన మరియు స్వీయ-అభివృద్ధి యొక్క ప్రయాణ‌ం. ఈ వేదిక ఎంతో మంది ఔత్సాహికుల‌కు స‌రైన వేదిక‌గా నిల‌వ‌డ‌మే కాకుండా దేశంలో ఒక ప్ర‌త్యేక గుర్తింపును అందిస్తుంది. ఈ అవార్డు సాధించ‌డం నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది’’ అన్నారు.

Advertisement
Advertisement