దివ్యాంగ కూలీలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-11-28T05:19:10+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ కోరారు.

దివ్యాంగ కూలీలకు ప్రాధాన్యం
ఉపాధి పని దినాలు పూర్తి చేసుకున్న దివ్యాంగ కూలీకి ప్రశంసాపత్రం అందజేస్తున్న అదనపు కలెక్టర్‌

- అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), నవంబరు 27 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ కోరారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో ఉపాధి హామీ-దివ్యాంగ కూలీలకు ఉద్దేశించి నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ ప్రత్యేక సమా వేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉపాధి పథకం కింద పనులు చేసే దివ్యాంగ కూలీలకు అన్నీ అంశా లలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు 30 శాతం తక్కువ పని చేసినప్పటికీ సకలాంగులతో సమానంగా వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. సమా వేశంలో దివ్యాంగులకు సంబంధించి ఉపాధి హామీ పథకం, సంక్షేమశాఖ, ఇతర శాఖల ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు తదితర అంశాలపై, పెన్షన్లు, సదరం ధ్రువపత్రాలపై కూడా చర్చించారు. జిల్లాలో 12,800 మంది దివ్యాంగు లకు పింఛన్లు ఇస్తుండగా వారిలో 6,300 మంది మహిళలే ఉన్నట్లు తెలిపారు. వికలాంగుల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ కింద రూ.13 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. వికలాంగులను సకలాంగులు వివా హం చేసుకున్న వారికి ప్రోత్సాహక బహుమతి కింద లక్ష రూపాయలు ప్రభు త్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. అనతంరం 150 రోటుల ఉపాధి కూలీ పనులు పూర్తి చేసుకున్న వికలాంగుల కూలీలకు అదనపు కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో యాదయ్య, అదనపు పీడీ శారద, మెప్మా నుంచి యాదయ్య, శిశు సంక్షేమ శాఖ పీడీ రాజేశ్వరి, డీబీటీ మేనేజర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:19:10+05:30 IST