‘ఫెక్సీ’.. సరికొత్త గర్భనిరోధక జెల్‌

ABN , First Publish Date - 2020-05-24T08:22:37+05:30 IST

గర్భ నిరోధకానికి అమెరికాలో ఓ సరికొత్త జెల్‌ అందుబాటులోకి వచ్చింది. అక్కడి ఔషధ నియంత్రణ అధికారులు శుక్రవారం ఈ మందుకు ఆమోదం తెలిపారు. ఎవోఫెం బయోసైన్సెస్‌ తయారు చేసిన ఈ జెల్‌ పేరు...

‘ఫెక్సీ’.. సరికొత్త గర్భనిరోధక జెల్‌

  • ఆమోదించిన అమెరికా


వాషింగ్టన్‌, మే 23: గర్భ నిరోధకానికి అమెరికాలో ఓ సరికొత్త జెల్‌ అందుబాటులోకి వచ్చింది. అక్కడి ఔషధ నియంత్రణ అధికారులు శుక్రవారం ఈ మందుకు ఆమోదం తెలిపారు. ఎవోఫెం బయోసైన్సెస్‌ తయారు చేసిన ఈ జెల్‌ పేరు ‘ఫెక్సీ’. దీనిలో లాట్రిక్‌ యాసిడ్‌, సిట్రిక్‌ యాసిడ్‌, పొటాషియమ్‌ బిటాట్రేట్‌ ఉంటాయి. ఇవన్నీ ఆహారాన్ని నిల్వ చేసేందుకు వాడేవే కావడంతో దీని వాడకం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ ఉండవని నిపుణులు అంటున్నారు. దీని పనితీరు అన్ని గర్భ నిరోధకాల తరహాలోనే ఉన్నప్పటికీ.. కొద్దిపాటి తేడాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణ గర్భ నిరోధకాలు గర్భాశయంలోకి వీర్యం ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. కానీ ఈ జెల్‌ మాత్రం వీర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. దీన్ని సంభోగానికి కాస్త ముందుగా స్త్రీ.. తన జననాంగానికి లోపలి భాగంలో రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-05-24T08:22:37+05:30 IST