కాల్పుల్లో మరణించిన గర్భిణి.. బిడ్డను కాపాడిన వైద్యులు

ABN , First Publish Date - 2020-10-14T06:48:21+05:30 IST

అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో స్టాసీ జోన్స్(35) అనే గర్భిణి

కాల్పుల్లో మరణించిన గర్భిణి.. బిడ్డను కాపాడిన వైద్యులు

చికాగో: అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో స్టాసీ జోన్స్(35) అనే గర్భిణి మృతిచెందగా వైద్యులు ఆమెకు డెలివరీ చేసి బిడ్డను కాపాడగలిగారు. డెలివరీలో గర్భిణికి ఆడపిల్ల జన్మించిందని, ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి చికాగోలో కొంతమంది దుండగులు స్టాసీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్టాసీ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానిక పోలీసులు స్టాసీని గమనించి వెంటనే యూనివర్శిటి ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్‌కు తరలించారు. 


స్టాసీ మరణించినట్టు గుర్తించిన వైద్యులు వెంటనే ఆమెకు డెలివరీ చేసి బిడ్డను కాపాడారు. స్టాసీ ఎనిమిదో నెల గర్భంతో ఉందని, నెల రోజుల ముందుగానే డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు. కాగా.. చికాగోలో గన్ వయిలెన్స్ విపరీతంగా పెరుగిపోయినట్టు తెలుస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది గన్ వయిలెన్స్ 50 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబర్ 4 నుంచి ఈ ఏడాది వరకు చికాగోలో మొత్తం 598 మంది తుపాకీ కాల్పుల్లో మరణించారు.

Updated Date - 2020-10-14T06:48:21+05:30 IST