పాము టాటూ వేయించుకున్న తరువాత గర్భం దాల్చిన యువతి.. అనంతరం ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2021-12-22T03:08:13+05:30 IST

టాటూ వేయించుకున్న కొన్ని నెలలకు గర్భం దాల్చిన మహిళ.. ఆ తరువాత ఊహించని షాక్

పాము టాటూ వేయించుకున్న తరువాత గర్భం దాల్చిన యువతి.. అనంతరం ఊహించని ట్విస్ట్..

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లోరిడా రాష్ట్రంలో(అమెరికా) జేడ్ హార్వీకి టాటూలంటే ఇష్టం. ఓ రోజు ఆన్‌లైన్‌లో ఓ పాము బొమ్మ కనిపించడంతో ఆ బొమ్మనే చేయిపై టాటూగా వేయించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఓ రోజు టాటూ వేయించుకుని మురిసిపోయింది. ఇదంతా గతేడాది జూన్ నాటి మాట. మరి కొద్ది నెలలకు ఆమె గర్భం దాల్చింది. కడుపులో పిండం ఆరోగ్యంగా ఎదుగుతోందని వైద్యులు చెప్పడంతో జేడ్ ఆమె కుటుంబసభ్యులు సంతోషించారు. కానీ.. ఇంతలో ఊహించిన షాక్! ఆమె టాటూ వేయించుకున్న ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద బొబ్బలు రావడం ప్రారంభమయ్యాయి. చర్మంపై టాటూ ఉన్న ప్రాంతమంతా వ్యాపించడం ప్రారంభించాయి. 


మొదట్లో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. రోజురోజుకు సమస్య తీవ్రమవుతుండడంతో జేడ్‌లో కంగారు మొదలైంది. కడుపులో బిడ్డకు ఏమవుతుందో అన్న ఆందోళనతో ఆస్పత్రికి వెళ్లింది. అయితే.. ఆమె హార్మోన్ల స్థాయిల్లో మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా.. గతంలో చర్మంపై పుండు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఆమె టాటూ వేయించుకుందని, ఆ తరువాత ఆమె గర్భం దాల్చడంతో హార్మన్ల స్థాయిల్లో మార్పులు చోటుచేసుకుని అలర్జీ వచ్చిందని వైద్యులు చెప్పారు. బొబ్బలపై లిక్విడ్ నైట్రోజన్ పోసి..అవి అణిగిపోయేలా చేయొచ్చని సూచించారు. వైద్యుల సలహాను పాటించి ఆమె బొబ్బల సమస్యను వదిలించుకుంది. 


ఈ విషయాలను జేడ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. చర్మంపై పళ్లు లేదా ఇతర గాయాలు ఉన్న ప్రాంతాలకు సమీపంలో టాటూలు వేయించుకోకండి అంటూ నెటిజన్లకు సలహా ఇచ్చింది జేడ్. అన్నట్టు సెప్టెంబర్ 2న ఆమె ఓ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పూర్తి ఆరోగ్యంతో జన్మించడంతో జేడ్, ఆమె కుటుంబసభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-12-22T03:08:13+05:30 IST