ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణి.. నొప్పులు రావడం లేదని పంపించేసిన డాక్టర్లు.. ఇంటికెళ్తోంటే..

ABN , First Publish Date - 2021-09-16T02:56:10+05:30 IST

ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ.. నొప్పులు రాకపోవడంతో ఇంటికి పింపిస్తే..మార్గమధ్యంలో..

ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణి.. నొప్పులు రావడం లేదని పంపించేసిన డాక్టర్లు.. ఇంటికెళ్తోంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ  రోజంతా ఆస్పత్రిలోనే ఉంది.. అయినా పురుటి నొప్పులు రాలేదు.. డెలివరీకి మరికొంత సమయం ఉందని వైద్యులు చెప్పారు. ఆ తరువాత.. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె భర్తతో కలిసి ఇంటికి బయలుదేరింది. మరికాసేపట్లో ఇంటికి చేరుతుందనగా.. మహిళకు అకస్మాత్తుగా నెప్పులు మొదలయ్యాయి. భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆస్పత్రికి తీసుకెళదామని నిర్ణయించాడు కానీ..ఆమెకు క్షణక్షణానికీ నెప్పుల తీవ్రత పెరిగిపోయింది. 


సోమవారం నాడు తాము ప్రసవం కోసం జిల్లా ప్రధానాస్పత్రిలో చేరామని భర్త ముఖేశ్ స్థానిక మీడియాకు తెలిపారు. రోజంతా ఆస్పత్రిలోనే ఉన్నామని, అయితే.. పురుటి నొప్పులు మొదలుకాలేదని చెప్పాడు. దీంతో.. మంగళవారం నాడు వైద్యులు డిశ్చార్జ్ చేశారన్నాడు, తాము ఇంటికి తిరిగివస్తుండగా.. మార్గమధ్యంలో అకస్మాత్తుగా భార్యకు పురిటినొప్పులు మొదలయ్యాయని తెలిపాడు. డెలవరీ విషయం తెలియగానే స్థానిక వైద్యాధికారులు ఘటనాస్థలానికి అంబులెన్స్ పంపించి తల్లిబిడ్డలను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు క్షేమంగాను ఉన్నారు. అయితే.. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలుసుకునేందుకు ఆస్పత్రి వైద్యులను సంప్రదింస్తానని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జెన్ తెలిపారు. వారి వివరణ విన్నాక ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 


దీంతో..ఖంగారు పడిపోయిన భర్త స్థానికంగా ఉన్న మహిళలను సహాయం అర్థించాడు. వారు ఆమెను ఓ కూరల బండిపై పడుకోపెట్టి..దాని చుట్టూ చీరలతో దడికట్టి డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోపు..విషయం స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తకు తెలియడంతో..ఆమె హుటాహుటీన ఓ మంత్రసానిని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చింది. ఈ క్రమంలో మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్‌ జిల్లాలో మంగళవారం నాడు జరిగిందీ ఘటన.

ఇవీ చదవండి:
SBI లో భారీ మోసం.. అసిస్టెంట్ మేనేజర్ పక్కా స్కెచ్.. కస్టమర్లకు తెలియకుండానే ఖాతాల్లోంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి..
యువకుడికి భారీ షాకిచ్చిన న్యాయస్థానం.. సత్ప్రవర్తన హామీపై విడుదల చేయాలని కోరితే.. న్యాయమూర్తి ఇలా..

Updated Date - 2021-09-16T02:56:10+05:30 IST