Abn logo
Aug 21 2021 @ 20:31PM

గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాచేపల్లి (మ) భట్రుపాలెంలో ప్రేమజంట  శ్రీకాంత్, నాగవర్ధిణి ఆత్మహత్యాయత్నం చేసింది. ఉదయం దాచేపల్లి కనకదుర్గమ్మ గుడిలో జంట పెళ్లి చేసుకుంది. అయితే ప్రేమ పెళ్లిని  తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో  శ్రీకాంత్, నాగవర్ధిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వీరిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. దాచేపల్లి (మ) నడికూడికి చెందిన శ్రీకాంత్ ఎంబీఏ చదువుతున్నాడు. గురజాల (మ) అంబాపరం వాసి నాగవర్ధిణి బీకాం చదువుతోంది. 


క్రైమ్ మరిన్ని...