నిజామాబాద్: జిల్లాలోని నందిపేట మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. కుద్వాన్ పూర్ గ్రామానికి చెందిన సుకన్య, ఐలపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున సుకన్య గ్రామంలోని తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలిసిన వెంటనే ప్రియుడు ప్రేమ్ కుమార్ కూడా అడవిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.