ఎరువు.. బరువు

ABN , First Publish Date - 2021-04-14T05:00:32+05:30 IST

ఎరువులు రైతులకు భారం కానున్నాయా అంటే.. వ్యవసాయాధికారుల నుంచి సరైన సమాధానం కరువవుతోంది. ముడి సరుకులు ప్రియం కావడంతో ఎరువుల ధరలు పెంచాలంటూ కర్మాగారాల ప్రతినిధులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ పాత ధరలకే విక్రయిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ప్రకటించి.. మళ్లీ మాట మార్చింది. ఇప్పటివరకు ఉన్న నిల్వల విక్రయాల వరకే పాత ధరలు పరిమితమని పేర్కొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగితే జిల్లాలో రైతులపై సుమారు రూ.7కోట్ల వరకు అదనపు భారం పడనుంది.

ఎరువు.. బరువు

ధరల పెంపునకు సన్నాహాలు

 ధరల పెంపునకు సన్నాహాలు

 జిల్లాపై రూ.7కోట్ల వరకు అదనపు భారం

 ఆందోళన చెందుతున్న రైతులు  

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఎరువులు రైతులకు భారం కానున్నాయా అంటే.. వ్యవసాయాధికారుల నుంచి సరైన సమాధానం కరువవుతోంది. ముడి సరుకులు ప్రియం కావడంతో ఎరువుల ధరలు పెంచాలంటూ కర్మాగారాల ప్రతినిధులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ పాత ధరలకే విక్రయిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ప్రకటించి.. మళ్లీ మాట మార్చింది. ఇప్పటివరకు ఉన్న నిల్వల విక్రయాల వరకే పాత ధరలు పరిమితమని పేర్కొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగితే జిల్లాలో రైతులపై సుమారు రూ.7కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే  కొన్ని కంపెనీలు ఎరువుల డీలర్లకు సమాచారం ఇచ్చాయి. యూరియాకు సంబంధించి ఇంకా ఏ సమాచారం రాలేదని డీలర్లు చెబుతున్నారు. అసలే వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని లబోదిబోమంటున్న రైతులను పెరగనున్న ఎరువుల ధరలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్టుబడి ఖర్చులు భరించలేక రైతులు ఎరువుల వినియోగం తగ్గించడంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో డీఏపీ, ఎంఓపీ ఎరువుల వినియోగం అనుకున్న స్థాయిలో లేదు. ఇప్పడు ధరలు పెరిగితే వినియోగం మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 


65 వేల మెట్రిక్‌ టన్నుల వినియోగం : 


జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 2.86 లక్షల హెక్టార్ల లో సాగవుతున్నాయి. వీటికి 65 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వేస్తున్నారు. ధర తక్కువని యూరియానే 48 వేల మెట్రిక్‌ టన్నులు ఉపయోగిస్తున్నారు. డీఏపీ, ఎంఓపీ ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు కలిపి 17 వేల మెట్రిక్‌ టన్నుల వరకు వినియోగిస్తున్నారు. డీఏపీ బస్తాకు రూ. 600, ఎంఓపీ రూ.120, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు రూ.350 వరకు ధర పెరిగే అవకాశముందని డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో అన్నదాతలపై అదనంగా రూ.7 కోట్లకుపైగా భారం పడనుందని వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు అంచనా వేస్తున్నారు.


అవసరం ఎక్కువ.. వినియోగం తక్కువ :


ఏ పంటకైనా స మతుల్యంగా ఎరువులు వేస్తేనే ఆశించిన దిగుబడులు వస్తాయి. రైతులు మాత్రం నత్రజని అందించే యూరియా అధిక మోతాదు లో వాడుతూ డీఏపీ, ఎంఓసీ వంటి కాంప్లెక్స్‌ ఎరువులను బాగా తక్కువగా వేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలోని వరి చేలకు డీఏపీ 52 కేజీలు వేయాల్సి ఉం డగా... 25 కేజీలే వినియోగిస్తున్నారు. ఎంఓపీ 33 కేజీల కు 15 కేజీలు వాడు తున్నారు. యూరియా 75 కేజీలకు బదులు 130 కేజీల వరకు వినియో గిస్తు న్నారు. యూరియా ధర తక్కువగా ఉండడంతో అధికంగా వాడుతు న్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, తాజాగా ధరలు పెరిగితే రైతులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.  

- పెరిగిన డీజిల్‌ ధరలు

ఓ వైపు ఎరువులతో పాటు మరోవైపు ఇంధన భారం అన్నదాతలపై పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో రబీ పంటలు చివరి దశలో ఉన్నాయి. ఈ సమయంలో వరుసగా పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో గత నెల రోజుల వ్యవధిలో లీటరు డీజిలు రూ.95కు చేరింది. దీంతో ట్రాక్టర్లు, యంత్రాలతో చేసే సేద్యం ఖర్చులన్నీ పెరగనున్నాయి. జిల్లాలో  మొన్నటి వరకు ఎకరా పొలం దున్నడానికి రూ. 1500 నుంచి రూ.2వేల వరకు డీజిల్‌ ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.2700 నుంచి రూ.3వేలకు డీజిల్‌ ఖర్చు పెరిగింది. జిల్లాలో సుమారు 45 వేల వరకు వ్యవసాయ ట్రాక్టర్లు ఉన్నాయి. చాలా మంది రైతులు ట్రాక్టర్లను అద్దెకు తెచ్చుకుని సేద్యం చేస్తున్నారు. అలాంటి వారిపై మరింత భారం పడుతోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. సబ్సిడీపై ఎరువులు, డీజిల్‌ అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  


 ఏటా ధరల ప్రభావం

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: రైతులపై ఏటా ఎరువుల రూపంలో ధరల ప్రభావం పడుతోంది. 2018 ఏప్రిల్‌లో ఎంఓపీ బస్తా రూ.614 ఉండగా, అదే ఏడాది రూ.875 చేశారు. ఇప్పుడు రూ.1,000 వరకు పెరగనుందని సమాచారం. 28-28, 14-35-14, 19-19-19 ధరలు రూ.1,350 నుంచి రూ.1,700కు పెంచనున్నట్టు తెలుస్తోంది. 2018 ఏప్రిల్‌లో డీఏపీ  రూ. 1,076 ఉండగా, అదే ఏడాది అక్టోబరులో రూ.1,200 కి పెరిగింది. కొన్నినెలల తర్వాత రూ.1,700కి చేరింది. తాజాగా రూ.1,900కు పెంచాలని ప్రతిపాదన సిద్ధమైంది. డీఏపీ, ఎంఓపీ, ఇతర కాంప్లెక్స్‌ ధరలు అధికంగా ఉం డడంతో.. తక్కువగా లభించే యూరియానే రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో చెరకు, ఇతర పంటలకు యూరియా 96 కిలోలు వేయాల్సి ఉండగా, 200 కిలోలు వినియోగిస్తున్నారు. డీఏపీ 87 కిలోలు వేయాల్సి ఉండగా... 22 కిలోలు మాత్రమే వాడుతు న్నారు. ఎంఓపీ 83 కిలోలకు 44 కిలోలు వినియోగిస్తున్నారు. ఇకపై ఎరువుల ధరలు పెరి గితే మరింత ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇంకా పెరగలేదు 

ఎరువుల ధరలు పెరుగుతాయన్న సమాచారమే తప్ప అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం పాత ధరలతోనే విక్రయిస్తున్నారు. ధర పెంచి ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.

- శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ

Updated Date - 2021-04-14T05:00:32+05:30 IST