ఆర్మీ క్యాంటీన్‌ ఏర్పాటుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-02-25T04:55:14+05:30 IST

జిల్లాకేంద్రంలో ఆర్మీ క్యాంటీన్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఆర్మీ క్యాంటీన్‌ ఏర్పాటుకు సన్నాహాలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో ఆర్మీ క్యాంటీన్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు హెడ్‌క్వార్టర్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ఎరియా సికింద్రాబాద్‌ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఓ లేఖ పంపించారని జిల్లా సైనిక్‌ అధికారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ సైనికులు, వితంతువుల  వ్యక్తిగత ఆమోదం తెలిపేలా  క్యాంటీన్‌ కార్డు నెంబరు,  విల్లింగ్‌ అండ్‌ అన్‌ విల్లింగ్‌ సమర్పించాల్సి ఉంటుందని  జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు చెప్పారు. ఇతర వివరాల కోసం 08922 274743 నెంబరును సంప్రదించాలని కోరారు. 

 

Updated Date - 2021-02-25T04:55:14+05:30 IST