Abn logo
Oct 22 2021 @ 00:22AM

సన్నాహక సమావేశాలు నిర్వహించాలి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

- మంత్రి కే తారకరామారావు 

- వేములవాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశం

సిరిసిల్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో నవంబరు 15న నిర్వహించే టీఆర్‌ఎస్‌ విజయ గర్జన సభకు అందరినీ కదిలించాలని, ఇందుకోసం సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు దిశానిర్దేశం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వేములవాడ నియోజకవర్గ  టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, జడ్పీటీసీలు, ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. మానకొండూరు నియోజకవర్గం సమావేశంలో జిల్లాలో ఉన్న ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు హాజరయ్యారు. వేములవాడ పట్టణంతోపాటు  గ్రామాల నుంచి సభకు  రావడానకి బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబరు 15న ఆర్టీసీ బస్సులన్నీ అద్దెకు తీసుకోనున్నట్లు, ఆ రోజు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌పై కొందరు  వ్యతిరేకతతో మాట్లాడుతున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో, మండలాల్లో విజయగర్జనను విజయవంతం చేయడానికి సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.   సమావేశంలో వేములవాడ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పుల్కం రాజు, వేములవాడ ఎంపీపీ బూర వజ్రవ్వ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ జడల శ్రీనివాస్‌, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపరాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొన్నాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తిరుపతి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ కేతిరెడ్డి నర్సారెడ్డి, చందుర్తి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు భైరగోని రమేష్‌, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ మాజీ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మానకొండూర్‌ నియోజకవర్గానికి సంబంధించి ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, మండలపరిషత్‌ ఉపాధ్యక్షుడు సుదగోని శ్రీనాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, చింతపల్లి వేణురావు పాల్గొన్నారు.