ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2021-03-05T05:39:31+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే యాసంగిలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వరి విస్తీర్ణంతో పాటు ధాన్యం ఎంత దిగుబడి వస్తుందో వివరాలను తయారు చే శారు.

ధాన్యం కొనుగోళ్లకు  ప్రణాళిక సిద్ధం

యాసంగిలో జిల్లాలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు అఽధకారుల నిర్ణయం

ధాన్యం కొనుగోలుపై ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం

నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న వరి కోతలు

నిజామాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే యాసంగిలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వరి విస్తీర్ణంతో పాటు ధాన్యం ఎంత దిగుబడి వస్తుందో వివరాలను తయారు చే శారు. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. గన్నీబ్యాగులు సిద్ధం చే యడంతో పాటు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపైన దృష్టిపెట్టారు. కూలీలు, వాహనాలు ఎన్ని అవసరమో వివరాలను తీసుకుంటూ ప్రణాళికకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలే దు. ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తుందో ప్రకటించలేదు. గతంలోలాగా అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ యాసంగిలో ధా న్యం సేకరిస్తుందా? లేదా? మార్కెట్‌ యార్డులలో కొనుగోలు చేస్తుందా? అనే విషయాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. వానాకాలం కొనుగోలు పూర్తికాగానే యాసంగిలో పండించే ధాన్యంపైన కొనుగోలు చేసే అవకాశం లేదని ప్రభుత్వం తరపున ప్రకటించారు. రై తులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయద్దని కోరారు.

యాసంగిలో భారీగా వరి సాగు 

 జిల్లాలో ఈ సంవత్సరం యాసంగిలో వరి విస్తీర్ణం భారీ గా పెరిగింది. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌తో పాటు గుత్ప, అలీసాగర్‌లో నీళ్లు ఉండడంతో రైతులు ఈ యాసంగిలో వరికే మొగ్గుచూపారు. కాల్వల కిందనే కాకుండా చెరువులు, బోర్ల కింద కూడా వరిని సాగును చేశారు. గ తంలో ఆరుతడి పంటలు వేసిన రైతులు కూడా ఈ దఫా వరి సాగుకు మొగ్గుచూపారు. జి ల్లాలో 3లక్షల 74వేల ఎకరాలకుపైగా ఈ యాసంగిలో వరి సాగు అ యింది. సన్న రకాలకు బ దులు రై తులు ఎక్కువగా దొడ్డు రకాలను సాగు చేశారు. వాతావరణం అను కూలంగా ఉండడం వలన వరి దిగుబడి కూడా భారీగా వచ్చే అవ కాశం ఉంది. ముందుగానే వర్ని, కోటగిరి ఏరియాల్లో ఈ నెలాఖరు నుంచి వరి కోతలు రానున్నాయి. సన్న రకాలకు బదులు దొడ్డు రకా లు వేయడం వల్ల వానాకాలం కంటే ఎక్కువ మొత్తంలో దిగుబడి ఉండనుంది. కేంద్రం కూడా దొడ్డు రకాలనే ఏ గ్రేడడ్‌ కింద క్వింటాలుకు రూ.1,888 నిర్ణయించడం వల్ల వానాకాలం లాగానే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు 

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలపైన ఎలాంటి నిర్ణయం తీ సుకోకున్నా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణం గా కేంద్రాల ఏర్పాటుపైన యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశా రు. ఈ యాసంగిలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వానాకాలం లాగానే ఎక్కువగా కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఒకవేళ కొనుగోలు కేంద్రాలకు అవకాశం ఇస్తే వెంటనే ప్రారంభించే విధంగా ప్రాణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం వరి విస్తీర్ణం ఆధార ంగా 8 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా దిగుబడి ఉండడంతో 330 కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వరి పండించే అన్ని మండలాల పరిధిలో గత వానాకాలం లా గానే ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పొందుపర్చారు. ఒకవేళ కొ నుగోలు కేంద్రాల ద్వారానే ధాన్య ం సేకరిస్తే సుమారు 2 కోట్లకు పైగా గన్నీబ్యాగ్‌లు అవసరమవు తాయని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో 50లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా మిగతా బ్యాగులను కలకత్తా నుంచి తెప్పిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి ధాన్యం మార్కెట్‌లోకి రా నుండడంతో ఆ లోపే అవసరమై న మేరకు కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు చేసేవిధంగా ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏర్పాటు చే సేందుకు సిద్ధమవుతున్నారు. ధా న్యం సేకరణ సమయంలో కూలీలతో పాటు వాహనాల కొరత లేకు ండా చూసేందుకు ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. వానాకాలంలో మొదట కొంత ఇబ్బందులు ఏర్పడిన ఆ తర్వాత రాష్ట్రంలోని అత్యధికంగా ధాన్యాన్ని సేకరించారు. అదే స్థాయిలో యాసంగిలో కూడా కొనుగోలు చేసేవిధంగా ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకుని అనుమతి ఇస్తే వెంటనే ప్రారంభించే విధంగా జిల్లా పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు ల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయా నికి అనుగుణంగా కొనుగోళ్లు ఉండనున్నాయి. గతంలోలాగా ఐకేపీ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చే సేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలుపై సమీక్షించి ప్రణాళికను పంపించారు. జి ల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రణాళికను ప్రభుత్వానికి పంపించామని జిల్లా పౌరసరఫరాల, సంస్థల అధికారులు వెంకటేశ్వర్‌రావ్‌, అభిషేక్‌ సింగ్‌లు తెలిపారు. ప్రభుత్వం నుంచి కొనుగోళ్లకు ఎలాంటి అనుమతులు రాలేదన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వ ఆ దేశాలకు అనుగుణంగానే ధాన్యం సేకరణ ఉంటుందని వారు తెలిపారు. 

Updated Date - 2021-03-05T05:39:31+05:30 IST