టెట్‌ నిర్వహణకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-06-12T05:09:30+05:30 IST

ఆదివారం నిర్వహించనున్న టెట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తెలిపారు.

టెట్‌ నిర్వహణకు సర్వం సిద్ధం
టె ట్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక ్టర్‌

  

వనపర్తి రూరల్‌, జూన్‌ 11: ఆదివారం నిర్వహించనున్న టెట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ర్యాంకర్‌ స్కూల్‌, సీవీ రామన్‌ టాలెంట్‌ స్కూల్‌, రావూస్‌ జూనియర్‌ కాలేజీ పరీక్ష కేంద్రాలను ఆయన పర్యవే క్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షకు హాజరవుతున్న అభ్య ర్థులకనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీ క్షా కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, ఇతర మౌలిక సదుపా యాలను ఏర్పాటుచేశామన్నారు. రూట్‌ అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతా యుతంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. కార్య క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-12T05:09:30+05:30 IST