సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-01-26T05:56:42+05:30 IST

గణతంత్ర వేడుకలు నగరంలోని పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబైంది. కొవిడ్‌ నిబంధనలతో కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

సర్వం సిద్ధం
విద్యుత దీప కాంతుల్లో టవర్‌క్లాక్‌

నేడు గణతంత్ర వేడుకలు.. పరేడ్‌ మైదానం ముస్తాబు

అనంతపురం క్రైం, జనవరి 25 : గణతంత్ర వేడుకలు నగరంలోని పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబైంది. కొవిడ్‌ నిబంధనలతో కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. కళాత్మకంగా  రంగు రంగుల జెండాలతో మైదానాన్ని అలంకరించారు. బుధవారం ఉదయం 9 గంటలకు పోలీసు పరేడ్‌ మైదానంలో గణతంత్ర వేడుకలు ప్రారంభం కా నున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గత ఏడాది కొవిడ్‌, ఇతర రంగాలలో విశేష కృషి చేసిన వారికి జిల్లా కలెక్టర్‌ చేతులు మీదుగా అవార్డులు అందజేస్తారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి ప్రదర్శించే నాటికలు, కళారూపాలు, ప్రదర్శించనున్నారు. ప్రతిభ కనబరిచిన వారికి తగిన బహుమతులు ప్రదానం చేయనున్నారు. 


 ఉదయం నుంచి ముమ్మర ఏర్పాట్లు..

అనంతపురం ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ మోహనకుమార్‌ తదితర రెవెన్యూ  అధికారులు, పోలీసు అధికారుల పర్యవేక్షణలో పరేడ్‌ మైదానం లో ఏర్పాట్లు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పా ట్లు ముమ్మరం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు చెందిన స్టాల్స్‌ను ఆయా శాఖల ఉ ద్యోగులు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజలు, గణతంత్ర వేడుకలు వీక్షించేందుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు.


 పోలీసు రిహార్సల్స్‌...

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పోలీసు పరేడ్‌ మైదానంలో మంగళవారం పలు పోలీసు బృందాలు పలు రిహార్సల్స్‌ చేశాయి. జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప రిహార్సల్స్‌ను పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయ జెండాకు గౌరవ వందనం చేయడం తదితర ప్రదర్శనలను వాహనంపై వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. 


 గణతంత్ర వేడుకలలో కార్యక్రమాలు ఇలా...

- ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తారు. 

- ఉదయం 9.05 గంటలకు పరేడ్‌ను సమీక్షిస్తారు. 

- ఉదయం 9. 15 గంటలకు జిల్లా  సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 

- 9.30 గంటలకు ప్రగతి నివేదికను చదవి వినిపిస్తారు. 

- 9.55 గంటలకు ప్రగతి రథముల ప్రదర్శన.

- ఉదయం 10.30 గంటలకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు

- ఉదయం 10. 45 గంటలకు ప్రతిభ కనబరిచిన ఉద్యో గులకు ప్రశంసా పత్రాల అందజేత

- 11.10 గంటలకు వివిధ రకాల స్టాల్స్‌ సందర్శన, వివిధ శాఖల లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం 


707 మందికి ఉత్తమ ప్రతిభా అవార్డులు 

అనంతపురం వ్యవసాయం, జనవరి 25 : గణతం త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు శాఖల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందిని ఉత్తమ ప్రతిభా అవార్డులకు ఎంపిక చేశారు. జిల్లాలోని పలు శాఖల్లో 707 మంది అధికారులు, సిబ్బం ది ఉత్తమ ప్రతిభా అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉ త్తమ ప్రతిభా అవార్డుల జాబితా ను కలెక్టర్‌ నాగలక్ష్మి విడుదల చేశారు. వీరికి బుధవారం పోలీసు పరేడ్‌ మైదానంలో జరిగే గణతంత్రదినోత్సవంలో అవార్డులు అందజేయనున్నారు. 




Updated Date - 2022-01-26T05:56:42+05:30 IST