Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోడు భూముల సర్వేకు సన్నద్ధం!


దరఖాస్తులను స్వీకరించిన అధికారులు
ప్రభుత్వ ఆదేశాలు వెలువడగానే జిల్లాలోని భూముల సర్వే
గ్రామ సభల ద్వారా అర్హుల గుర్తింపు
నిరుపేద రైతులకు భూములపై అందనున్న హక్కు పత్రాలు


నిజామాబాద్‌, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) నవంబరు 27: భూమిలేని నిరుపేదలు.. చేసేందుకు పని దొరకక.. కు టుంబ పోషణ నిమిత్తం దశాబ్దాలుగా పోడు భూముల ను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కానీ వారికి ఆ భూములకు సంబంధించిన హక్కు పత్రాలు గా నీ, పట్టాలు గానీ లేకపోవడంతో కొన్ని భూములను అట వీశాఖ వారు తిరిగి స్వాధీనం చేసుకోవడంతో చాలా కు టుంబాలు రోడ్డున పడుతున్నాయి. అటువంటి అర్హులైన నిరుపేద రైతులను గుర్తించి వారికి భూమి సాగు హక్కు పత్రాలు ఇచ్చి వారి ఉపాధికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2005 డిసెంబరు 13 కన్నా ముందు నుంచి పోడు భూములు సాగుచేస్తున్న రైతులకు మాత్రమే అటవీ హక్కుల చట్టం ప్రకారం భూములపైన హక్కులను కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సైతం ప్రభుత్వ సూచనల మేరకు సంబంధిత అధికారులు ఇప్పటికే స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే భూ ములను పరిశీలించి అర్హులైన వారికి హక్కు పత్రాలు జారీ చేసేందుకు అధికారులు క సరత్తు చేస్తున్నారు. ఆయా ఊళ్లలో గ్రామ సభలు ఏ ర్పాటు చేయనున్నారు. గ్రామసభల తీర్మానం ద్వారా ఆమో దం పొంది మండల, డివిజన్‌, జిల్లా కమిటీల ద్వారా అనుమతులు పొందిన వారికి భూములపైన హక్కులను కల్పించనున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న వారికి భూములను ఇవ్వనున్నారు.
హరితహారంతో ముదిరిన వివాదం..
జిల్లాలో అటవీప్రాంతంలో ఏళ్ల తరబడి పోడు వ్యవసాయాన్ని రైతులు చేస్తున్నా రు. అటవీ భూములు ఎక్కువగా వ్యవసాయం చేస్తూ పంటలను పండిస్తున్నారు. హరితహారం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ భూముల్లో మొక్కలు నాటుతుండడంతో పలు గ్రామాల పరిధిలో వివాదాలు ముదిరాయి. అన్ని జిల్లాల్లో పోడు రైతులు ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం రైతులకు హక్కులు కల్పించేందుకు నిర్ణయించింది. పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 20 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
14వేల 57 మంది దరఖాస్తు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అటవీ హక్కుల కమిటీల ద్వారా జిల్లాలో పోడు భూముల్లో సాగుచేస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గ్రామాల్లో వీరు ఉంటున్నారా, ఎన్ని ఏళ్ల నుంచి నివాసం ఉం టున్నారో గ్రామసభల ద్వారా పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ దరఖాస్తును స్వీకరించారు. జిల్లాలో పోడు భూములు మొత్తం 36, 935 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని 19 మండలాలు, 135 రెవెన్యూ గ్రామాల్లో ఈ భూముల కోసం దరఖాస్తులను తీసుకున్నారు. మొత్తం 14వేల 57 మంది తాము పోడు  భూములు సాగుచేస్తున్నట్లు తమకు హక్కులు కల్పించాలని కమిటీలకు దరఖాస్తులను చేసుకున్నారు. వీరిలో 8,535 మంది గిరిజనులు ఉండగా 5,522 మంది ఇతర రైతులు ఉన్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా ఈ భూములను సాగుచేసుకుంటున్నారు. తమకు హక్కులు కల్పించాలని తహసీల్‌ కార్యాలయాలతో పాటు ఆర్‌డీవో, కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులను చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులను కలిసి పోడు భూముల సమస్య పరిష్కరించాలని హక్కులు కల్పించాలని కోరారు.
మూడు మండలాల్లో అధికంగా..
జిల్లాలో సిరికొండ, భీమ్‌గల్‌, వర్ని మండలాల పరిధిలో ఈపోడు భూములు ఎక్కువగా ఉండగా మిగతా మండలాల్లో కొంత తక్కువగా ఉన్నాయి. జిల్లాలో పోడు భూముల పరిష్కారం కోసం భూప్రక్షాళన సమయంలోనే జాయింట్‌ సర్వేను నిర్వహించారు. అది పూర్తికాలేదు. ఆ సర్వేలో గతంలో రెవెన్యూ అధికారులు ఇచ్చినపట్టాల ప్రకారం పాస్‌ బుక్‌లను అందజేశారు. పోడు భూములపైన దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో తీసుకున్న దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఆయా గ్రామాల పరిధిలో ప్రత్యేక కమిటీలను వేస్తున్నారు. ఈ కమిటీల ద్వారా దరఖాస్తు చేసుకున్న పోడు రైతుల భూములను పరిశీలిస్తారు. ఆ రైతు ఎన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారో చూస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2005 డిసెంబరు 13 కన్నా ముందు నుంచి సాగుచేస్తున్న రైతులకు మాత్రమే అటవీ హక్కుల చట్టం ప్రకారం భూములపైన హక్కులను కల్పిస్తారు. సాగుచేసుకునేందుకు అవకాశం ఇస్తారు. డిసెంబరు 2005 తర్వాత పోడు భూముల్లో సాగుచేసుకునే వారికి మాత్రం హక్కులు కల్పించే అవకాశం లేదు.
సర్వే ద్వారా భూముల గుర్తింపు..
గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తుల కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తున్నా రు. ఆ షెడ్యూల్‌ ప్రకారం ఏయే అధికారులు గ్రామాల్లో సర్వే చేస్తారో పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదే శాలు రాగానే గ్రామాల వారీగా ఈ పోడుభూములను సర్వే ద్వారా గుర్తించనున్నారు. దరఖాస్తు ప్రకారం అటవీ ప్రాంతంలోని ఏ సర్వే నెంబర్‌లో సాగుచేస్తాన్నారో గుర్తిస్తారు. ఆ గ్రామం పరిధిలోని దరఖాస్తు చేసుకున్న వారందనివీ పరిశీలించిన తర్వాత గ్రామసభలు నిర్వహిస్తారు. గ్రామసభల్లో ప్రజలముందు వివరాలను ఉంచి వారందరి తీర్మానానికి అనుగుణంగా గ్రామ అటవీ హక్కుల కమిటీ ద్వారా మండల అటవీ హక్కుల కమిటీకి సిఫారసు చేస్తారు. మండల కమిటీ నుంచి డివిజన్‌ కమిటీకి  అక్కడ నుంచి జిల్లా కమిటీకి పంపిస్తారు. కలెక్టర్‌ ఆధ్వర్యం లో ఉండే ఈ కమిటీ పరిశీలించిన అనంతరం అర్హులైన రైతులకు వారు సాగుచేస్తున్న పోడు భూములపైన హక్కులను కల్పిస్తూ పత్రాలను అందిస్తారు. రెండు విడతల్లో ఇప్పటికే పరిశీలించిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భూములను పరిశీలించేందుకు ఏర్పాట్ల ను చేస్తున్నారు. పోడు భూముల్లో సాగుచేస్తున్న వేలాది మందిలో అర్హులైనవారిని గుర్తించిన అనంతరంప్రభుత్వానికి నివేదించనున్నారు. నిబంధనల ప్రకారం లేనివారికి మాత్రం పోడు భూములపై హక్కులు కల్పించే అవకాశం లేదు.
భూముల గుర్తింపునకు ప్రత్యేక షెడ్యూల్‌..
- అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

జిల్లాలోని పోడు భూముల్లో సాగుచేస్తున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించాం. భూములను గుర్తించేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భూములను పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం ఉన్నవారికి ఈ భూములపైన హక్కులను కల్పిస్తాం.

Advertisement
Advertisement