పుష్పాభిషేకానికి సిద్ధం

‘తగ్గేదే..లే..’ అంటూ మీసం మెలేస్తున్నాడు అల్లు అర్జున్‌. ‘పుష్ప’ కోసం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. డిసెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్‌కి కూడా ముహూర్తం కుదిరింది. డిసెంబరు 6న ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న చిత్రమిది. బన్నీ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా. కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో సమంత ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పాటని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.


Advertisement