అంతిమ సమరానికి సిద్ధం

ABN , First Publish Date - 2022-01-27T04:42:26+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులతో వైసీపీ ప్రభుత్వం పంతానికి పోకుండా సమస్య మరింత జటిలం కాక ముందే ప్రతిష్టంభన తొలగించాలని లేదంటే అంతిమ సమరానికి సిద్ధం కావాలని పీఆర్‌సీ సాధన సమితి నేతలు స్పష్టంచేశారు.

అంతిమ సమరానికి సిద్ధం
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న ఉద్యోగులు

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన

పీఆర్‌సీ సాధన సమితి నేతలు

కడప మారుతీనగర్‌, జనవరి 26: ప్రభుత్వ ఉద్యోగులతో వైసీపీ ప్రభుత్వం పంతానికి పోకుండా సమస్య మరింత జటిలం కాక ముందే ప్రతిష్టంభన తొలగించాలని లేదంటే అంతిమ సమరానికి సిద్ధం కావాలని పీఆర్‌సీ సాధన సమితి నేతలు స్పష్టంచేశారు. పీఆర్‌సీ సాధన సమితి పిలుపుమేరకు పీఆర్‌సీ స్ట్రగుల్‌ కమిటీ జిల్లా శాఖ దశలవారీ పోరాటాల్లో భాగంగా ఆర్‌టీసీ బస్టాండు సమీప అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన సమితి నేతలు బి. శ్రీనివాసులు, జలీల్‌ఖాన్‌, గోవిందు రవికుమార్‌, వెంకటజనార్దన్‌రెడ్డి, లక్ష్మీరాజా, కె. సురే్‌షబాబు, మాట్లాడుతూ అధికారంలో కి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని నమ్మించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 

ఉద్యోగులకు పాత పీఆర్‌సీ అమలు చేసే వరకూ సహాయ నిరాకరణ కొనసాగుతుందన్నారు. ప్రస్తుత పీఆర్‌సీని అంగీకరించే ప్రసక్తే లేదని, ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మె తప్పదన్నారు. పీఆర్‌సీ సాధన సమితి నేతలు నారాయణరెడ్డి, లెక్కల జమాల్‌రెడ్డి, ఆర్టీసీ నేతలు ఎ.ఆర్‌.మూర్తి, సగినాల శ్రీనివాసులు, నాగముని, వెంకటరెడ్డి, విజయకుమార్‌, పుల్లయ్య, వరదారెడ్డి, రామకృష్ణారెడ్డి, గంగన్న, జంబారపు అహరోన్‌, రామమోహన్‌రెడ్డి, సుబ్బరాయుడు, వెంకట్రామిరెడ్డి, మహిళా ఉద్యోగులు నీలవేణి పాల్గొన్నారు. 

నేటి నుంచి  పీఆర్సీ రిలే నిరహార దీక్షలు : ఎన్జీఓ

కడప (కలెక్టరేట్‌) జనవరి 26: కలెక్టరేట్‌ వద్ద గురువారం నుంచి 30 వతేదీ వరకు పీఆర్సీ సాధన సమితి నిరహార దీక్షలు నిర్వహి స్తున్నట్లు జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు బి. శ్రీనివాసులు పిలుపు నిచ్చా రు. పీఆర్సీ స్ట్రగుల్‌  కమిటీ  కడప జిల్లా శాఖా ఆధ్వర్యంలో పీ ఆర్సీ అంతిమ సాధన కోసం ప్ర భుత్వంపై పోరాడేందుకు ఉద్యోగులంతా  సిద్ధం కావాలన్నారు జీఓలను వెంటనే రద్దు చేసి ఐఆర్‌ కంటే పిట్‌మెంట్‌ అధికంగా ఇవ్వాలనీ కోరుతూ గణతంత్ర దినోత్సవం నాడు ఎన్జీవోలు, ఉద్యోగులంతా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2022-01-27T04:42:26+05:30 IST