Abn logo
Sep 25 2021 @ 00:53AM

రబీ పంటల సాగు ప్రణాళిక సిద్ధం

పప్పుశనగ  సరఫరాకు టెండర్ల నిర్వహణ

ఒకటి, రెండు రోజుల్లో సబ్సిడీ ధరలు ఖరారు

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 24:  ఈఏడాది రబీ సీజనలో పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. అక్టోబరు ను ంచి రబీ సీజన ఆరంభం కానుంది. ఇందుకు మరో ఆరు రోజులే గడువు ఉంది. ప్రతి ఏడాది రబీ సీజన ఆరంభంలో సబ్సి డీతో పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈ సారి 41వేల క్వింటాళ్ల పప్పుశనగ అవస రమని ఇది వరకే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పింది. ఆ మేరకు విత్తనాలు సరఫరా చేయాలని ఏపీసీ డ్స్‌కు సమాచారం అం దించారు. రాష్ట్ర స్థాయిలో పప్పు శనగ విత్తనాల సరఫరాకు ఎట్టకేలకు టెండర్లు నిర్వహించారు. ఒకటి, రెండు రోజుల్లో సబ్సిడీ ధరలు ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వ ర్గాల ద్వారా అందిన సమాచారం. 


1.41 లక్షల హెక్టార్లల్లో పంటలు సాగయ్యే అవకాశం  

ఈ సారి రబీ సీజనలో జిల్లా వ్యాప్తంగా 1.41 లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో 78వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు అయ్యే అవకాశం ఉంది. గతేడాది రబీ సీజనలో 1.85 లక్షల హెక్టా ర్లల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 87వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగైంది. ఈ ఏడాది సకాలంలో పదును వర్షాలు పడితే సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధి కంగానే పంటలు సాగయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.