వేరుశనగ పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2021-10-17T05:54:11+05:30 IST

ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన రాజశేఖర్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు సూచించారు.

వేరుశనగ పంట నష్టంపై  నివేదికలు సిద్ధం చేయండి


 జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన రాజశేఖర్‌రెడ్డి 

అనంతపురం,అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన రాజశేఖర్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. చైర్మన రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన ప్రారంభమైన నేపథ్యంలో నల్లరేగడి భూములున్న ప్రాంతాల్లో సబ్సిడీతో విత్తన పప్పుశనగ పంపిణీ సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో తగినంత ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు ఎరువుల స్టాక్‌ వివరాలను ముందస్తుగా ఉన్నతాధికారులకు తెలియజేసి ఆ మేరకు తెప్పించుకోవాలన్నారు.  కంది పంట ఆశాజనకంగా ఉందని, మంచి దిగుబడులు వచ్చేందుకు పాటించాల్సిన పద్ధతులపై తగు సూచనలు ఇప్పించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ముందస్తుగానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. జూన, సెప్టెంబరు మాసాల మధ్యలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరువు నివేదికలు సిద్ధం చేసి అందించాలన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి పంటనష్టపరిహారం మంజూరుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం వస్తుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పలువురు వ్యవసాయ సలహా మండలి సభ్యులు, జేసీ నిశాంతకుమార్‌, జేడీఏ చంద్రానాయక్‌, సెరి కల్చర్‌ ఏడీ శాంతి, నాబార్డు ఏజీఎం ఉషా మధుసూదన, ఏపీఎ్‌సపీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగరాజు, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌, పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేష్‌, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌, ఏడీఏలు సతీష్‌, పద్మావతి, శా స్త్రవేత్తలు డా. సహదేవరెడ్డి, డా. సంపతకుమార్‌, రైతులు కృష్ణమూర్తి, రామకృష్ణ, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:54:11+05:30 IST