చిన్న పార్టీలతో పొత్తుకు ఎస్పీ సిద్ధం

ABN , First Publish Date - 2021-08-02T07:33:28+05:30 IST

చిన్న పార్టీలతో పొత్తుకు తమ పార్టీ సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు.

చిన్న పార్టీలతో పొత్తుకు ఎస్పీ సిద్ధం

కాంగ్రెస్‌, బీఎస్పీ తేల్చుకోవాలి: అఖిలేశ్‌ 

లఖ్‌నవూ, జూలై 1: చిన్న పార్టీలతో పొత్తుకు తమ పార్టీ సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు చిన్న పార్టీలు కూటమి కట్టేందుకు ముందుకుర రావాలని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీపై తరచూ విమర్శలు చేసే కాంగ్రెస్‌, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీలతోనూ కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ రెండు పార్టీలు తమ దాడి బీజేపీ మీదనో, ఎస్పీ మీదనో అనేది తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ‘2022 ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు కోసం మా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో చిన్న పార్టీలు మాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. ఇంకొన్ని ముందుకొచ్చే అవకాశాలున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-02T07:33:28+05:30 IST