ధాన్యం కొనుగోలుకు సిద్ధం

ABN , First Publish Date - 2021-11-26T04:23:38+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా సివిల్‌ సప్లయ్స్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై గురువారం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైసు మిల్లర్లు వెంటనే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు సిద్ధం
మాట్లాడుతున్న జేసీ కిషోర్‌కుమార్‌

బ్యాంకు గ్యారెంటీలు తీసుకోండి

జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశం

కలెక్టరేట్‌, నవంబరు 25: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా సివిల్‌ సప్లయ్స్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై గురువారం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైసు మిల్లర్లు వెంటనే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ కోసం 186 ఏజెన్సీలను ఎంపిక చేశామన్నారు. తాజాగా నాలుగు ఎఫ్‌పీవోలకు కూడా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత అప్పగించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సిబ్బందిని ప్రొక్యూర్‌మెంట్‌ సపోర్టింగ్‌ ఏజెన్సీలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఆర్‌బీకేల్లో గన్నీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి అప్పలనాయుడు, డీఎస్‌వో పాపారావు, డీసీసీబీ సీఈవో జనార్ధన్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం యాసిన్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం దేవుళ్లనాయక్‌, మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు కొండపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 

గోదాములనూ సిద్ధం చేయండి

జిల్లాలో బియ్యం నిల్వలకు సరిపడే గోదాములను సిద్ధంగా ఉంచుకోవాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన తరువాత బియ్యం నిల్వలు ఉంచేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 



Updated Date - 2021-11-26T04:23:38+05:30 IST