తాజాగా నిరాశాజనకమే... అయినా...

ABN , First Publish Date - 2021-10-23T04:34:41+05:30 IST

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సెప్టెంబరు 30 తో ముగిసిన రెండో త్రైమాసికంలో నిరాశాజనకమైన ఫలితాలను వెలువరించింది.

తాజాగా నిరాశాజనకమే... అయినా...

హైదరాబాద్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సెప్టెంబరు 30 తో ముగిసిన రెండో త్రైమాసికంలో నిరాశాజనకమైన ఫలితాలను వెలువరించింది. దాదాపు పదహారు శాతం క్షీణించిన నేపధ్యంలో... కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 275.91 కోట్లకు చేరింది. జీవిత బీమా సంస్థ గతేడాది రూ. 327.83 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. జూలై-సెప్టెంబరు కాలంలో ఇన్స్యూరర్ మొత్తం ఆదాయం రూ. 20,478.46 కోట్లకు పెరిగింది.


సంవత్సరం క్రితం ఇది రూ .16,426.03 కోట్లుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్... రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. నికర ప్రీమియం ఆదాయం గత ఏడాది కాలంలో రూ. 10,056.71 కోట్ల నుంచి రూ. 11,445.53 కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నిరాశాజనకమైన త్రైమాసిక ఫలితాలను వెలువరించడంతో కంపెనీ షేర్ల పతనం ప్రారంభమైంది. కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో ఒక్కొక్కటి రూ. 684.80 వద్ద ట్రేడవుతున్నాయి. గత ముగింపు ఃకంటే 1.45 శాతం క్షీణించాయి. ఇక... ఈ నిరాశాజనకమైన ఫలితాలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లపై ఎలాంటి ప్రభావం చూపనుందో వేచి చూడాలి. 

Updated Date - 2021-10-23T04:34:41+05:30 IST