Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో భారతీయురాలిని ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేసిన బైడెన్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారతీయ అమెరికన్ న్యాయవాదిని ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఇండియన్ అమెరికన్ సర్క్యూట్ కోర్టు చీఫ్ జడ్జి శాలిన డీ కుమార్‌ను మిచిగాన్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జిగా బుధవారం నామినేట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఓక్లాండ్ కౌంటీ ఆరవ సర్క్యూట్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. 2007 నుంచి శాలిన ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2007 ఆగస్టు 20న మిచిగాన్ మాజీ గవర్నర్ జెన్నీఫర్ గ్రాన్‌హోం శాలినను ఓక్లాండ్ కౌంటీ ఆరవ సర్క్యూట్ కోర్టు చీఫ్ జడ్జిగా నియమించారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న జడ్జి జీన్ ష్నెల్జ్ రిటైర్మెంట్ కావడంతో ఆమె స్థానంలో శాలిన చీఫ్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, మిచిగాన్ కోర్టు ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయిన శాలిన తొలి దక్షిణ ఆసియా మహిళ అని వైట్‌హౌస్ వెల్లడించింది. శాలిన 1993లో మిచిగాన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం 1996లో డెట్రాయిట్ యూనివర్శిటీలో మెర్సీ స్కూల్ ఆఫ్ లా చేశారు.  


ఇక న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించన అనంతరం శాలిన వివిధ బాధ్యతలు నిర్వహించారు. అడల్ట్ ట్రీట్మెంట్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఓక్లాండ్ కౌంటీ క్రిమినల్ అసైన్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్, ఓక్లాండ్ కౌంటీ బార్ అసోసియేషన్ సర్క్యూట్ కోర్ట్ కమిటీకి బెంచ్ అనుసంధానకర్త, మిచిగాన్ స్టేట్ బార్ ప్రొఫెషనలిజం కమిటీ సభ్యురాలు, మిచిగాన్ న్యాయమూర్తుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement