రాజ్‌పథ్ నుంచి బయల్దేరిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

ABN , First Publish Date - 2022-01-26T18:00:52+05:30 IST

రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడులకల్ని ముగించుకున్న భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరారు. 73వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

రాజ్‌పథ్ నుంచి బయల్దేరిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

న్యూఢిల్లీ: రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడులకల్ని ముగించుకున్న భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరారు. 73వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా, ఈ యేడాది గణతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక, సైనిక ప్రదర్శనల నడుమ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌కు వచ్చిన అనంతరమే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు.


దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.రాజ్ పథ్ లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.

Updated Date - 2022-01-26T18:00:52+05:30 IST