Abn logo
Aug 11 2020 @ 00:55AM

బ్లాక్‌స్టోన్‌ చేతికి ‘ప్రెస్టీజ్‌’ ఆస్తులు!

  • డీల్‌ విలువ రూ.13,500 కోట్లు 
  • జాబితాలో హైదరాబాద్‌ ప్రాపర్టీలు


న్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రం గా ఉన్న  రియల్టీ సంస్థ ప్రెస్ట్రీజ్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోని తన వాణిజ్య స్థిరాస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా రూ.12,000 కోట్ల నుంచి రూ.13,500 కోట్లు లభిస్తాయని అంచనా వేస్తోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ బ్లాక్‌స్టోన్‌ ఈ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సెప్టెంబరులోగా రెండు సంస్థలు తుది ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. 


విక్రయించే ఆస్తులు..

ప్రెస్ట్రీజ్‌ గ్రూప్‌ అమ్మకానికి పెట్టిన ఆస్తుల్లో నిర్మాణం పూర్తయిన 80 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) ఆఫీసుల భవనాలు, 40 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ విస్తీర్ణం ఉన్న తొమ్మిది మాల్స్‌ ఉన్నాయి. వీటికి తోడు ఇంకా నిర్మాణంలో ఉన్న 30-40 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీసు భవనాల్లో సగం వాటాను కూడా అమ్మే అవకాశం ఉందని సమాచారం. 


ఎందుకంటే ?

కొవిడ్‌తో దేశవ్యాప్తంగా రియల్టీ రంగం కుప్పకూలింది. అప్పులు చెల్లించడం కొన్ని రియల్టీ కంపెనీలకు భారంగా మారింది. దీంతో ఆఫీసుల కోసం నిర్మించిన భవనాల్ని రియల్టీ కంపెనీలు అమ్మకానికి పెడుతున్నాయి. ప్రెస్ట్రీజ్‌ గ్రూప్‌పై ప్రస్తుతం దాదాపు రూ.8,000 కోట్ల అప్పుల భారం ఉంది. ఈ మూడు నగరాల్లోని వాణిజ్య స్థిరాస్తుల అమ్మకం ద్వారా వచ్చే రూ.12,000- 13,500 కోట్లతో అప్పులు తీర్చుకుని, మిగతా నిధులను భవిష్యత్‌ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని ప్రెస్ట్రీజ్‌ భావిస్తోంది. అందుకే ఈ ఆస్తులను అమ్మకానికి పెట్టిందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement