ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టండి

ABN , First Publish Date - 2021-12-06T08:19:28+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టండి

జగిత్యాల జిల్లాలో రైతుల రాస్తారోకో

మల్లాపూర్‌, డిసెంబరు 5: ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు తాలు పేరిట 40 కిలోల బస్తాకు మూడు కిలోల వరకు ధాన్యం ఎక్కువగా తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపు, కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ రవీందర్‌, సొసైటీ చైర్మన్‌ నర్సారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

Updated Date - 2021-12-06T08:19:28+05:30 IST