ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టండి

ABN , First Publish Date - 2021-06-23T10:11:47+05:30 IST

తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర ప్రైవేటు ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు జగన్‌ విజ్ఞప్తి చేశారు

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టండి

కేంద్ర ఆరోగ్య మంత్రికి బాధిత సంఘం వినతి


న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర ప్రైవేటు ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు జగన్‌ విజ్ఞప్తి చేశారు.  మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు.  రోజుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, కరోనా రెండో దశలో రోగులు ఆస్తులు అమ్ముకోవలసి వచ్చిందని వివరించారు. ఇదే విషయమై జాతీయ బీసీ కమిషన్‌కు కూడా జగన్‌ ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-06-23T10:11:47+05:30 IST