జీకా వైర్‌సకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-07-13T05:30:00+05:30 IST

వర్షాకాలం డెంగూ మొదలు చిగున్‌గున్యా వరకూ పలు రకాల సీజనల్‌ వ్యాధులు దాడి చేస్తూ

జీకా వైర్‌సకు అడ్డుకట్ట

వర్షాకాలం డెంగూ మొదలు చిగున్‌గున్యా వరకూ పలు రకాల సీజనల్‌ వ్యాధులు దాడి చేస్తూ ఉంటాయి. అయితే డెంగూ, మలేరియాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా జీకా వైరస్‌ వ్యాప్తినీ తగ్గించవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు.


కేరళలో ఇప్పటివరకూ 18 జీకా వైరస్‌ కేసులు నమోదవడంతో మిగతా రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. తలనొప్పి, జ్వరం, దద్దుర్లు, కళ్ల కలక, కీళ్లు, కండరాల నొప్పులు మొదలైన లక్షణాలు కలిగి ఉండే జీకా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ రెండు నుంచి ఏడు రోజుల పాటు వేధిస్తుంది. ఎక్కువ మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే గర్భిణులకు జీకా వైరస్‌ సోకడం వల్ల మైక్రోసెఫాలీ అనే మెదడు సంబంధించిన లోపంతో బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయనీ, దీన్నే కంజెనైటల్‌ జీకా సిండ్రోమ్‌ అంటారనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.


 కాబట్టి వర్షాకాలంలో వ్యాఽధికారక సూక్ష్మక్రిముల వ్యాప్తికి వీలుండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. ఇందుకోసం  ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అవసరం. ఖాళీ షాంపూ సీసాలు, కొబ్బరి చిప్పలు, టైర్లు మొదలైన నీళ్లు నిల్వ ఉండే వీలున్న వస్తువులను ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. కూలర్లలో మిగిలిపోయిన నీటిని తొలగించి, శుభ్రంగా ఉంచుకోవాలి. తేమ లేకుండా, ఇంట్లో పొడి వాతావరణాన్ని కల్పించాలని వైద్యులు సూచిస్తున్నారు. 


Updated Date - 2021-07-13T05:30:00+05:30 IST