ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కరోనాకు చెక్‌!

ABN , First Publish Date - 2020-03-04T00:48:40+05:30 IST

చైనా అంటే నిన్నటివరకూ - టెక్నాలజీకి కేరాఫ్‌ ఎడ్రస్‌. అయితే ఇప్పుడు చైనా అనగానే గుర్తొస్తున్నది కరోనా వైరసే!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కరోనాకు చెక్‌!

చైనా అంటే నిన్నటివరకూ - టెక్నాలజీకి కేరాఫ్‌ ఎడ్రస్‌. అయితే ఇప్పుడు చైనా అనగానే గుర్తొస్తున్నది కరోనా వైరసే!  అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ని కంట్రోల్‌ చేయడానికి చైనా తన టెక్నాలజీని వాడుతోందట.


అవును. మాంచెస్టర్‌ యూనివర్సిటీ, కాంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ - కలసి ఇప్పుడు కరోనాకి - ప్రారంభదశలోనే చెక్‌ చెప్పడానికి మార్గాలు అన్వేషించాయి. ఇందుకోసం వాళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మీద ఆధారపడ్డారు.


వైరస్‌ అనేది కంప్యూటర్‌ కి సంబంధించినది అయితే - యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్లనీ టెక్నాలజీనీ వాడచ్చు. కానీ మనిషి శరీరాన్ని ఎటాక్‌ చేసే వైరస్‌ నివారణకి - టెక్నికల్‌ సొల్యూషన్‌ ఎలా? అనుకుంటున్నారా? అదే విశేషం మరి.


కరోనా వైరస్‌ వచ్చేముందు అత్యంత ముందస్తుగా వచ్చే సూచన - శరీరం అంతర్గతంగా వేడెక్కుతుందట. అలాగని ప్రతి జ్వరాన్నీ కరోనా వైరస్‌ అని కంగారుపడిపోవాల్సిన పని లేదు. అయితే కరోనాకి సంబంధించిన ప్రిలిమినరీ వేడిని ఎంత తొందరగా గుర్తిస్తే - అంత ప్రభావశీలంగా దాని వ్యాప్తిని ఆపవచ్చట. అయితే శరీర ఉష్ణోగ్రతలో ఈ మార్పుని మామూలుగా గుర్తించడం కష్టమట. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని వాడుతున్నారు చైనీయులు.


కరోనా వచ్చిన తరవాత - ముఖానికి మాస్క్‌ ఉన్నప్పటికీ - ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఫేస్‌ని గుర్తించే ఎఐ సిస్టమ్‌ని చైనీయులు ఇప్పటికే తయారుచేశారు. ఇప్పుడు దాంట్లో ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీని కలిపి, శరీర ఉష్ణోగ్రత మార్పుల్ని సూక్ష్మంగా కనుక్కుంటున్నారట. ఈ ఎఐ ( ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ కి వాళ్లు పెట్టిన పేరు Firetinas.  ఈ  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ - చైనాకే కాదు, ఏ దేశానికైనా సూటవుతుందని వాళ్లు అంటున్నారు. ఫైర్‌టినాస్‌ అని చదువుతారో ఫిరెటినాస్‌ అంటున్నారో గానీ... వైరస్‌ పాకకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడితే అంతే చాలు!

Updated Date - 2020-03-04T00:48:40+05:30 IST