పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ

ABN , First Publish Date - 2021-06-18T05:16:31+05:30 IST

పరిసరాలు పరిశుభ్రతతో ఉన్నప్పుడే వ్యాధుల వ్యాప్తిని నియంత్రించగలమని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూన్‌ 17 : పరిసరాలు పరిశుభ్రతతో ఉన్నప్పుడే వ్యాధుల వ్యాప్తిని నియంత్రించగలమని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యం, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. దోమల ద్వారా పలు రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో కోటా చలం, డాక్టర్‌ సాహితి, డీపీవో యాదయ్య, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ వెంకటరమణ, మాధవరెడ్డి, శ్రీనివాసరాజు, మునిసిపల్‌ కమిషనర్లు, ఐసీడీఎస్‌ అధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:16:31+05:30 IST