ముడిసరుకుల దిగుమతితో ధరల పెరుగుదల: చైనా

ABN , First Publish Date - 2021-05-15T07:26:15+05:30 IST

ముడిసరుకుల దిగుమతి కారణంగా చైనా తయారీదారుల నుంచి భారత కంపెనీలు కొనుగోలు చేస్తున్న కొన్ని కొవిడ్‌-19 వైద్యసామగ్రి (ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వంటివి) ధరలు పెరిగినట్టు చైనా పేర్కొంది

ముడిసరుకుల దిగుమతితో ధరల పెరుగుదల: చైనా

బీజింగ్‌, మే 14: ముడిసరుకుల దిగుమతి కారణంగా చైనా తయారీదారుల నుంచి భారత కంపెనీలు కొనుగోలు చేస్తున్న కొన్ని కొవిడ్‌-19 వైద్యసామగ్రి (ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వంటివి) ధరలు పెరిగినట్టు చైనా పేర్కొంది. భారత్‌ నుంచి డిమాండ్‌ బాగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ముడిసరుకులను కంపెనీలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చినట్టు తెలిపింది. భారత్‌ డిమాండ్‌ను తీర్చే విధంగా తమ కంపెనీలను చైనా ప్రోత్సహిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ తెలిపారు. గత ఏప్రిల్‌లో 26 వేలకు పైగా వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 15వేలకు పైగా మానిటర్లు, దాదాపు 3,800 టన్నుల మెడిసిన్‌ మెటీరియల్స్‌, ఔషధాలను భారత్‌కు చైనా ఎగుమతి చేసింది. 70 వేలకు పైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కోసం భారత్‌ నుంచి చైనా కంపెనీలు ఆర్డర్లను పొందాయి. 

Updated Date - 2021-05-15T07:26:15+05:30 IST