Abn logo
Sep 19 2021 @ 01:29AM

విద్యార్థులకు విషయ పరిజ్ఞానం ముఖ్యం

 సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.సునీత

చల్లపల్లి, సెప్టెంబరు 18 : విద్యార్థులకు మార్కుల కన్నా విషయ పరిజ్ఞానం ముఖ్యమని సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.సునీత అన్నారు. చల్లపల్లి నారాయణరావు నగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలను శనివారం ఆమె పరిశీలించారు. పాఠ శాల తరగతి గదులు, వసతిగృహం, భోజనశాల, ఆవరణ శుభ్రత పరిశీలించారు. శుభ్రతను, విద్యార్థుల వసతిని మెరుగుపర్చుకోవాలని ప్రిన్సిపల్‌ శైలజాకుమారికి సూచిం చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాల నిర్వహిం చాలని, తరగతి గది , వసతి గృహంలో 20 మందికి మించి ఉండరాదని స్పష్టం చేశారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

 గురుకుల పాఠశాల పరిశీలన

 పామర్రు :  కొవిడ్‌ నిబంధనల మేరకు  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో  బోధన  నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాకి సునీత ఆదేశించారు. నల్లకుంటలోని బాలయోగి గురుకుల పాఠశాలను ఆమె శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.    ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్‌హాలు, వసతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  పరిసరాల పరిశుభ్రత తోపాటు వ్యక్తిగత పరిశుభత్ర పాటించాలన్నారు. జిల్లా కో-ఆర్డినేటర్‌, వాసవి ఐటీఐ ప్రిన్సిపాల్‌ టి.ఆశాలత తదితరులు పాల్గొన్నారు.