ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-07-23T05:15:18+05:30 IST

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ వ్యాధి అధికారి భాస్కర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు తనిఖీ చేస్తున్న భాస్కర్‌

రామాపురం, జూలై22: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ వ్యాధి అధికారి భాస్కర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి మండలంలో ఎంత మంది ఉన్నారు. వాళ్లకు మం దులు ఇస్తున్నారని డాక్టర్‌ విజయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా వచ్చిన ప్రతి వ్యక్తికి టీబీ పరీక్షలు చేయాలన్నారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి  టీబీ పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి విజయ్‌కుమార్‌, డాక్టర్‌ వినోద్‌కుమార్‌, సీహెచ్‌వో ఈఎస్‌ ఎలియాజర్‌, టీబీ సూపర్‌వైజర్‌ హరి, రామతులసి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-23T05:15:18+05:30 IST