Abn logo
Feb 2 2020 @ 16:02PM

ప్రధాన మంత్రి భద్రతకి 600 కోట్ల బడ్జెట్

న్యూ ఢిల్లీ : :

ఇక నుంచి  మాజీ ప్రధానికి ఎస్పీజీ భద్రత 5 సంవత్సరాలు మాత్రమే

 
శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దేశ ప్రధాన మంత్రి భద్రత కోసం ఏకంగా 600 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధాన మంత్రికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో 300 మంది పనిచేస్తున్నారు. వీరి కోసం గత సంవత్సరం 540 కోట్లు వెచ్చించారు. అంతకు ముందు సంవత్సరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఖర్చు 420 కోట్లు.
 
గతంలో గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉండేది. కానీ సోనియా, రాహుల్, ప్రియాంకలకు గత సంవత్సరం నవంబరు నుంచి ఎస్పీజీ భద్రత తొలగించారు. ఎస్పీజీ ప్రొటొకాల్‌ని గాంధీ కుటుంబు ఉల్లంఘించిన కారణంగా వారికి ఎస్పీజీ భద్రత తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవె గౌడ, వీపీ సింగ్‌లు కూడా ఎస్జీజీ భద్రత జాబితాలో ఉన్నారు.
 
ఇందిరా గాంధీ హత్య అనంతరం 1985లో ఎస్పీజీ భద్రత వ్యవస్థ ఏర్పడింది. ప్రధానుల భద్రత కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో రాజీవ్ హత్య తర్వాత గాంధీ కుటంబానికి భద్రత ఏర్పాటు చేశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పీవీ నరసింహారావు, హెచ్‌డి దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌కు భద్రత తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ప్రధాన మంత్రి పదవి నుంచి తొలగిన తరువాత కూడా ఎస్పీజీ మాజీ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఆయన చనిపోయే దాకా ఎస్పీజీ భద్రత కల్పించింది. కానీ మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ భద్రత నుంచి గత సంవత్సరం ఆగస్టున ఎస్పీజీని తొలగించారు. ఇప్పుడు ఏదైనా మాజీ ప్రధాన మంత్రికి ఎస్పీజీ భద్రత 5 సంవత్సరాలు ఉండేలా చట్టాన్ని సవరించారు.

TAGS: