పారదర్శక పన్నుల విధాన పథకాన్ని ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2020-08-13T18:12:56+05:30 IST

ఆదాయపన్ను వ్యవస్థ బలోపేతానికి మరిన్ని సంస్కరణలు తీసుకువస్తూ..

పారదర్శక పన్నుల విధాన పథకాన్ని ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: ఆదాయపన్ను వ్యవస్థ బలోపేతానికి మరిన్ని సంస్కరణలు తీసుకువస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం 'ట్రాన్స్‌పరెంట్‌ ట్యాక్సేషన్‌- హానరింగ్‌ ద హానెస్ట్‌' (పారదర్శక పన్నుల విధాన పథకం)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమన్నారు. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చునని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ప్రత్యేక వేదిక ఎంతో ఉపయోగమన్నారు. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమని మోదీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు మరింత పెరిగే అవకాశం ఉందని, సెప్టెంబరు 25 నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆదాయ, కార్పొరేటు పన్ను తగ్గించామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-13T18:12:56+05:30 IST