Abn logo
Sep 27 2021 @ 00:24AM

యువతను మోసం చేస్తున్న ప్రధాని మోదీ

సమావేశంలో మాట్లాడుతున్న మస్తాన్‌ వలీ

 కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  షేక్‌ మస్తాన్‌వలీ

 భారత్‌ బంద్‌కు మద్దతు తెలపాలని పిలుపు 

అనకాపల్లిటౌన్‌, సెప్టెంబరు 26: దేశంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ప్రధాని నరేంద్రమోదీ మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలీ ఆరోపిం చారు. ఆదివారం స్థానిక వైఎంవీఏ హాల్‌లో పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు బోయినభానుమూర్తి యాదవ్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్‌  సమావేశంలో ఆయ న మాట్లాడారు.  నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను మోసం చేశారన్నారు. ఏడాదిగా రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో  నిరసన తెలియజేస్తున్నా స్పందించకపోవడం విచారకరమన్నారు. చట్టాల పట్ల  బీజేపీ మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచి సామాన్య ప్రజలపై ఆర్ధికభారం మోపిందన్నారు. అంతేకా కుండా దేశంలో ప్రజల మధ్య విబేధాలు సృష్టి స్తున్నారని బీజేపీ నేత పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ సోమవారం జరిగే భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రుత్తల శ్రీరామ్మూర్తి, మీసాల సుబ్బన్న, శ్రీను, నారాయ ణరావు, బొడ్డు శ్రీను, ఎం.కోటేశ్వరరావు, సీపీఎం నేత ఎ.బాలకృష్ణ, సీపీఐ నేత వైఎన్‌ భద్రం, ఆమ్‌ఆద్మీ కన్వీ నర్‌ కె. హరినాథబాబు తదితరులు పాల్గొన్నారు.