మోదీ ప్రైవేట్ కార్యదర్శికి ప్రపంచ బ్యాంక్‌లో కీలక పదవి

ABN , First Publish Date - 2020-06-05T00:21:58+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శి రాజీవ్ టోప్నోకు ప్రపంచ బ్యాంకులో కీలక పదవి దక్కింది

మోదీ ప్రైవేట్ కార్యదర్శికి ప్రపంచ బ్యాంక్‌లో కీలక పదవి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శి రాజీవ్ టోప్నోకు ప్రపంచ బ్యాంకులో కీలక పదవి దక్కింది. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌కు సీనియర్ సలహాదారుగా ఆయన్ను నియమించారు. 1974 మే 28న రాజీవ్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జన్మించారు. 1996 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ మన్మోహన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. మోదీ అధికారంలోకి వచ్చాక రాజీవ్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నారు. ఊహించినట్లే ఆయన సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు.


ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌కు సీనియర్ సలహాదారుగా వెళ్లేందుకు రాజీవ్‌కు ప్రధాని నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీ క్లీయరెన్స్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లో ఆయన మూడేళ్లపాటు ఉంటారు.  

Updated Date - 2020-06-05T00:21:58+05:30 IST