ప్రధాని మోదీ అరుదైన ఘనత!

ABN , First Publish Date - 2021-08-02T07:08:14+05:30 IST

ప్రధాని మోదీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

ప్రధాని మోదీ అరుదైన ఘనత!

  • ఐరాస భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత
  • భారత తొలి ప్రధానిగా రికార్డు


ప్రధాని మోదీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా నిలవనున్నారు. ఆగస్టు నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనుంది. ఈ పదవీ కాలంలో భారత్‌ 3 అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలకు మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ట్విటర్లో వెల్లడించారు. సముద్ర భద్రత, శాంతిని కాపాడడం, ఉగ్రవాద నిర్మూలనపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి తెలిపారు. కాగా, రొటేషన్‌ విధానంలో భారత్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం మొత్తం మీద ఇది తొమ్మిదో సారి. 

Updated Date - 2021-08-02T07:08:14+05:30 IST