నిరుద్యోగులను రోడ్డున పడేసిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-01-28T05:55:28+05:30 IST

కోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తామని మోస పూరిత హామీతో గద్దెనెక్కి... నిరుద్యోగులను రోడ్డునపడేసిన ప్రధాని నరేంద్రమోదీజీ గద్దెదిగడానికి రోజులు లెక్కపెట్టుకోవాలని ఎనఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌ మండిపడ్డారు.

నిరుద్యోగులను రోడ్డున పడేసిన ప్రధాని మోదీ
నినాదాలుచేస్తున్న ఎనఎస్‌యూఐ నాయకులు

నిరుద్యోగులను రోడ్డున పడేసిన ప్రధాని మోదీ

- ఉద్యోగం అడిగిన నిరుద్యోగులపై కాల్పులా?

- ఎనఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌

అనంతపురం అర్బన, జనవరి 27 :  కోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తామని మోస పూరిత హామీతో గద్దెనెక్కి... నిరుద్యోగులను రోడ్డునపడేసిన ప్రధాని నరేంద్రమోదీజీ గద్దెదిగడానికి రోజులు లెక్కపెట్టుకోవాలని ఎనఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌ మండిపడ్డారు. ఎనఎస్‌యూఐ జాతీయ నాయకత్వం పిలుపుమేరకు శుక్రవా రం జిల్లా అధ్యక్షుడు ఓబిలేసు ఆధ్వర్యంలో అనంతపురం రైల్వేస్టేషన ముట్టడి కార్య క్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌ మాట్లాడుతూ.... హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాలని ప్రశ్నించిన నిరుద్యోగులపై బీహార్‌లో బీజేపీ కాల్పులు జరిపించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ని రసన తెలిపే స్వేచ్ఛను ప్రధాని హరిస్తున్నారని మండిపడ్డారు. నియంతృత్వ ధోర ణితో ఉద్యమాలను అణచివేస్తామని మోదీ భ్రమపడుతున్నారు. దీంతో విద్యార్థుల పోరాటం మరింత ఉధృతంగా మారుతుందన్నారు. నిరుద్యోగులపై కాల్పులను వ్యతి రేకిస్తూ రైల్వేస్టేషన ముట్టడిలో పాల్గొన్న నాయకులను అనంతపురం పోలీసులు అరెస్ట్‌ చేయడం నిరుద్యోగుల గొంతుకను నొక్కేయడమేనన్నారు. అరెస్ట్‌ చేసిన వారి ని భేషరతుగా విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. మరోవైపు గ్రూప్‌-డీ పరీక్షల్లో సీబీటీ-2ని తొలగించాలన్నారు. నీట్‌ పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రఘువరణ్‌, నరేంద్ర, గిరీష్‌, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-28T05:55:28+05:30 IST